ట్రెండింగ్ లో ఎంఎక్స్ టకాటక్..
మొబైల్ యాప్ మార్కెటింగ్ ఇంటెలిజెన్స్ సంస్థ సెన్సార్ టవర్ నుండి వచ్చిన డేటా ప్రకారం ఎంఎక్స్ టకాటక్ అనే యాప్ ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ టిక్‌టాక్ వంటి ప్రముఖ సోషల్ మీడియా యాప్‌లను ఓడించి ఆసియాలోనే నెంబర్ వన్ షార్ట్ వీడియో యాప్ గా నిలిచింది. షార్ట్ వీడియో యాప్ ల ట్రెండ్ మొదలైన తర్వాత టిక్ టాక్ ప్రపంచ వ్యాప్తంగా ప్రజాదరణ పొందింది. అయితే టిక్ టాక్ పై బ్యాన్ విధిస్తూ దానిపై వ్యతిరేకత పెరగగానే అన్ని […]
మొబైల్ యాప్ మార్కెటింగ్ ఇంటెలిజెన్స్ సంస్థ సెన్సార్ టవర్ నుండి వచ్చిన డేటా ప్రకారం ఎంఎక్స్ టకాటక్ అనే యాప్ ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ టిక్‌టాక్ వంటి ప్రముఖ సోషల్ మీడియా యాప్‌లను ఓడించి ఆసియాలోనే నెంబర్ వన్ షార్ట్ వీడియో యాప్ గా నిలిచింది.
షార్ట్ వీడియో యాప్ ల ట్రెండ్ మొదలైన తర్వాత టిక్ టాక్ ప్రపంచ వ్యాప్తంగా ప్రజాదరణ పొందింది. అయితే టిక్ టాక్ పై బ్యాన్ విధిస్తూ దానిపై వ్యతిరేకత పెరగగానే అన్ని టెక్ సంస్థలు షార్ట్ వీడియో ప్లాట్ ఫార్మ్స్ ను రెడీ చేసాయి. ఇన్ స్టారీల్స్, యూట్యూబ్ షార్ట్స్ ఇలా రకరకాల ప్లాట్ ఫార్మ్స్ వచ్చాయి. వాటితో పాటు మనదేశంలో మోజ్, జోష్ లాంటి యాప్ లు కూడా పాపులర్ అయ్యాయి. అయితే ఇప్పుడు వాటన్నిటిని దాటేస్తూ ఎంఎక్స్ టకాటక్ అత్యధిక డౌన్లోడ్స్ తో దూసుకెళ్తోంది.
ఎంఎక్స్ టకాటక్ 2021 మొదటి త్రైమాసికంలో 80 మిలియన్లకు పైగా డౌన్‌లోడ్లతో ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా డౌన్‌లోడ్ చేయబడిన ఇండియన్ యాప్ గా ఉంది. అలాగే గూగుల్ ప్లే, యాపిల్ యాప్ స్టోర్ రెండింటిలోనూ ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా డౌన్‌లోడ్ చేయబడిన టాప్ టెన్ యాప్స్ లో ఒకటి గా నిలిచింది.