దర్శకుడిపై క్లారిటీ ఇచ్చిన కొణెదల కంపెనీ

లూసిఫర్ రీమేక్ పై మొన్నటివరకు చాలా ప్రచారం జరిగింది. చిరంజీవి హీరోగా నటించబోతున్న ఈ సినిమాకు సంబంధించి దర్శకుడ్ని మార్చేస్తున్నారనేది ఆ పుకారు. తమిళ దర్శకుడు మోహన్ రాజాను ఈ సినిమాకు దర్శకుడిగా ఎఁపిక చేశారు. కలిసి ఫొటోలు కూడా దిగారు. అంతలోనే అతడ్ని తొలిగించారంటూ పుకార్లు వచ్చాయి. దీనిపై పరోక్షంగా క్లారిటీ ఇచ్చింది యూనిట్. ఈరోజు మోహన్ రాజా తన పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా అతడికి శుభాకాంక్షలు అందించింది కొణెదల ప్రొడక్షన్ కంపెనీ. దీంతో […]

Advertisement
Update:2021-05-30 08:36 IST

లూసిఫర్ రీమేక్ పై మొన్నటివరకు చాలా ప్రచారం జరిగింది. చిరంజీవి హీరోగా నటించబోతున్న ఈ
సినిమాకు సంబంధించి దర్శకుడ్ని మార్చేస్తున్నారనేది ఆ పుకారు. తమిళ దర్శకుడు మోహన్ రాజాను ఈ
సినిమాకు దర్శకుడిగా ఎఁపిక చేశారు. కలిసి ఫొటోలు కూడా దిగారు. అంతలోనే అతడ్ని తొలిగించారంటూ
పుకార్లు వచ్చాయి. దీనిపై పరోక్షంగా క్లారిటీ ఇచ్చింది యూనిట్.

ఈరోజు మోహన్ రాజా తన పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా అతడికి శుభాకాంక్షలు
అందించింది కొణెదల ప్రొడక్షన్ కంపెనీ. దీంతో ఈ పుకార్లకు చెక్ పడినట్టయింది. అటు చిరంజీవితో
లూసిఫర్ రీమేక్ ను నిర్మించనున్న మెగా సూపర్ గుడ్ ఫిలిమ్స్, ఎన్వీ ప్రసాద్ కూడా మోహన్ రాజాకు
పుట్టినరోజు శుభాకాంక్షలు అందించడంతో పుకార్లు తేలిపోయాయి.

నిజానికి లూసిఫర్ రీమేక్ కోసం ముందుగా సాహో దర్శకుడు సుజీత్ ను అనుకున్నారు. అతడి లూసిఫర్
బౌండెడ్ స్క్రిప్ట్ కూడా రెడీ చేశాడు. కానీ అది చిరంజీవికి నచ్చలేదు. ఆ తర్వాత సీన్ లోకి వచ్చిన
మోహన్ రాజ్, తన మార్పుచేర్పులతో చిరంజీవిని మెప్పించారు.

ఆచార్య పూర్తయిన వెంటనే మోహన్ రాజా దర్శకతంలో లూసిఫర్ రీమేక్ సెట్స్ పైకి వస్తుంది. తెలుగులో
ఈ సినిమాకు లూసిఫర్ అనే ఒరిజినల్ టైటిల్ నే అనుకుంటున్నారు. కానీ తాజాగా కింగ్ మేకర్ అనే మరో
టైటిల్ ప్రచారంలో ఉంది.

Tags:    
Advertisement

Similar News