ఆగస్ట్ లో ఆచార్య
ఆచార్య సినిమా రిలీజ్ వాయిదా పడిన సంగతి అందరికీ తెలిసిందే. అధికారికంగా ప్రకటించనప్పటికీ, ఆ సినిమా విడుదలతో పాటు, షూటింగ్ కూడా నిలిచిపోయింది. ఇప్పుడు ఆచార్య యూనిట్ మరో కొత్త తేదీపై అప్పుడే కసరత్తు మొదలుపెట్టింది. ఇందులో భాగంగా ఆగస్ట్ నెలలో ఓ మంచి డేట్ కోసం చూస్తోంది. నిజానికి ఆచార్య సినిమా విడుదల పోస్ట్ పోన్ అయిందంటూ అధికారికంగా ప్రకటించాలనుకున్నారు. కానీ అలా వాయిదా పడిందంటూ ప్రకటించడం కంటే.. మరో కొత్త తేదీని ప్రకటిస్తే పాజిటివ్ […]
ఆచార్య సినిమా రిలీజ్ వాయిదా పడిన సంగతి అందరికీ తెలిసిందే. అధికారికంగా ప్రకటించనప్పటికీ, ఆ
సినిమా విడుదలతో పాటు, షూటింగ్ కూడా నిలిచిపోయింది. ఇప్పుడు ఆచార్య యూనిట్ మరో కొత్త తేదీపై
అప్పుడే కసరత్తు మొదలుపెట్టింది. ఇందులో భాగంగా ఆగస్ట్ నెలలో ఓ మంచి డేట్ కోసం చూస్తోంది.
నిజానికి ఆచార్య సినిమా విడుదల పోస్ట్ పోన్ అయిందంటూ అధికారికంగా ప్రకటించాలనుకున్నారు. కానీ
అలా వాయిదా పడిందంటూ ప్రకటించడం కంటే.. మరో కొత్త తేదీని ప్రకటిస్తే పాజిటివ్ గా ఉంటుందని
అనుకున్నారు. స్వయంగా చిరంజీవి ఇచ్చిన ఐడియా ఇది.
దీంతో ఆగస్ట్ లో రిలీజ్ కోసం తేదీ వెదుకుతున్నారు. ముందు నుంచి ఈ సినిమా బిజినెస్ వ్యవహారాన్ని
కొరటాల శివ చూసుకుంటున్నారు. ఈ కొత్త తేదీ ప్రకటన పనిని కూడా కొరటాలకే అప్పగించారు చిరంజీవి,
నిర్మాత నిరంజన్ రెడ్డి. ప్రసుతం కొరటాల, బయ్యర్లతో చర్చల్లో ఉన్నాడు. మే నెలలో ఆచార్య కొత్త
విడుదల తేదీని అధికారికంగా ప్రకటిస్తారు.