నందాను మెచ్చిన చిరు

రిలీజ్ కు ముందు నుంచి వకీల్ సాబ్ కు బ్రాండ్ అంబాసిడర్ గా మారారు చిరంజీవి. ఓవైపు ఆచార్య సినిమా పనులు చూసుకుంటూనే మరోవైపు వకీల్ సాబ్ ప్రచారాన్ని భుజానికెత్తుకున్నారు. సినిమా రిలీజైన వెంటనే, ప్రత్యేకంగా వీక్షించి అందర్నీ పేరుపేరునా మెచ్చుకున్నారు చిరంజీవి. ఆ తర్వాత దిల్ రాజు, వేణు శ్రీరామ్ ను ఇంటికి పిలిపించుకొని సత్కరించారు. ఇప్పుడు ప్రకాష్ రాజ్ ను కూడా ప్రత్యేకంగా మెచ్చుకున్నారు చిరు. ఈరోజు ప్రకాష్ రాజ్ ను తన ఇంటికి […]

Advertisement
Update:2021-04-12 13:44 IST

రిలీజ్ కు ముందు నుంచి వకీల్ సాబ్ కు బ్రాండ్ అంబాసిడర్ గా మారారు చిరంజీవి. ఓవైపు ఆచార్య
సినిమా పనులు చూసుకుంటూనే మరోవైపు వకీల్ సాబ్ ప్రచారాన్ని భుజానికెత్తుకున్నారు. సినిమా రిలీజైన
వెంటనే, ప్రత్యేకంగా వీక్షించి అందర్నీ పేరుపేరునా మెచ్చుకున్నారు చిరంజీవి. ఆ తర్వాత దిల్ రాజు,
వేణు శ్రీరామ్ ను ఇంటికి పిలిపించుకొని సత్కరించారు. ఇప్పుడు ప్రకాష్ రాజ్ ను కూడా ప్రత్యేకంగా
మెచ్చుకున్నారు చిరు.

ఈరోజు ప్రకాష్ రాజ్ ను తన ఇంటికి పిలిపించుకున్నారు చిరంజీవి. ఆయనకు బొకే ఇచ్చి సత్కరించారు.
వకీల్ సాబ్ లో లాయర్ నందాగా అద్భుతంగా నటించారంటూ మెచ్చుకున్నారు. చిరంజీవి ప్రశంసలతో
ప్రకాష్ రాజ్ ఉబ్బితబ్బిబ్బయ్యారు.

కొన్ని రోజుల కిందట పవన్ కల్యాణ్ కూడా ప్రకాష్ రాజ్ ను ప్రత్యేకంగా మెచ్చుకున్నాడు. రాజకీయంగా
తమ దారులు వేరు అయినప్పటికీ.. సినిమాల పరంగా ప్రకాష్ రాజ్ ను తను ఎంతో ఇష్టపడతానని.. వకీల్
సాబ్ ద్వితీయార్థంలో తను బాగా నటించడానికి, ప్రకాష్ రాజ్ లాంటి నటుడు ఎదురుగా ఉండడమే
కారణమని చెప్పుకొచ్చాడు.

Tags:    
Advertisement

Similar News