ఆచార్య విడుదల వాయిదా

కరోనా సెకెండ్ వేవ్ టాలీవుడ్ ను గట్టిగా తాకుతోంది. ఇప్పటికే పలువు ప్రముఖులు కరోనా బారిన పడ్డారు. అల్లు అరవింద్, త్రివిక్రమ్, నివేత థామస్ లాంటి వాళ్లు కరోనా బారిన పడి కోలుకోగా.. తాజాగా నటుడు బ్రహ్మాజీ కూడా కరోనా బారిన పడ్డాడు. మరోవైపు సినిమాలు కూడా వాయిదా పడుతున్నాయి. ఇప్పటికే లవ్ స్టోరీ సినిమాను వాయిదా వేయగా.. ఇప్పుడీ జాబితాలోకి చిరంజీవి నటిస్తున్న భారీ బడ్జెట్ మూవీ ఆచార్య కూడా చేరిపోయింది. అవును.. మే 13న […]

Advertisement
Update:2021-04-12 13:52 IST

కరోనా సెకెండ్ వేవ్ టాలీవుడ్ ను గట్టిగా తాకుతోంది. ఇప్పటికే పలువు ప్రముఖులు కరోనా బారిన పడ్డారు.
అల్లు అరవింద్, త్రివిక్రమ్, నివేత థామస్ లాంటి వాళ్లు కరోనా బారిన పడి కోలుకోగా.. తాజాగా నటుడు
బ్రహ్మాజీ కూడా కరోనా బారిన పడ్డాడు. మరోవైపు సినిమాలు కూడా వాయిదా పడుతున్నాయి. ఇప్పటికే లవ్
స్టోరీ సినిమాను వాయిదా వేయగా.. ఇప్పుడీ జాబితాలోకి చిరంజీవి నటిస్తున్న భారీ బడ్జెట్ మూవీ ఆచార్య
కూడా చేరిపోయింది.

అవును.. మే 13న విడుదల కావాల్సిన ఆచార్య సినిమాను పోస్ట్ పోన్ చేశారు. కుదిరితే ఈ సినిమాను జూన్
మూడో వారంలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ మేరకు రేపోమాపో అధికారిక ప్రకటన
రానుంది. చిరంజీవి స్వయంగా సోషల్ మీడియాలో ఈ విషయాన్ని బయటపెట్టే ఆలోచనలో ఉన్నారు.

ఆచార్య సినిమాకు సంబంధించి షూటింగ్ ఇంకా పెండింగ్ ఉంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా కొలిక్కి
రాలేదు. మరోవైపు కరోనా కేసులు కూడా పెరుగుతున్నాయి. దీంతో ఆచార్య సినిమా విడుదలను వాయిదా
వేయాలని యూనిట్ నిర్ణయించింది.

చిరంజీవి, రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్న ఈ సినిమాను కొరటాల శివ డైరక్ట్ చేస్తున్నారు. కాజల్, పూజా
హెగ్డే హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో రెజీనా ఓ స్పెషల్ సాంగ్ చేసింది.

Tags:    
Advertisement

Similar News