కరోనా ఎఫెక్ట్‌... ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో కోత !

కరోనా ప్రభావం మొదలైంది. లాక్‌డౌన్‌ ప్రభుత్వాల ఆర్ధిక పరిస్థితి పై పడింది. దీంతో తెలంగాణ సర్కార్‌ సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అధికారులతో చర్చించిన సీఎం కేసీఆర్‌ వేతనాల కోత పెట్టే నిర్ణయం తీసుకున్నారు. ప్రజాప్రతినిధుల నుంచి ఐఎఎస్‌ ఆఫీసర్ లు, నాల్గో తరగతి ఉద్యోగుల వేతనాల్లో కోత పెట్టారు. రిటైర్డ్‌ ఉద్యోగుల పెన్షన్‌లను కూడా తగ్గించారు. ఈ మేరకు ఆదివారం ప్రెస్‌మీట్‌లోనే ఉద్యోగులు కొన్ని త్యాగాలు చేయాల్సి ఉంటుందని కేసీఆర్‌ హింట్‌ ఇచ్చారు. ఈ […]

Advertisement
Update:2020-03-31 02:47 IST

కరోనా ప్రభావం మొదలైంది. లాక్‌డౌన్‌ ప్రభుత్వాల ఆర్ధిక పరిస్థితి పై పడింది. దీంతో తెలంగాణ సర్కార్‌ సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అధికారులతో చర్చించిన సీఎం కేసీఆర్‌ వేతనాల కోత పెట్టే నిర్ణయం తీసుకున్నారు.

ప్రజాప్రతినిధుల నుంచి ఐఎఎస్‌ ఆఫీసర్ లు, నాల్గో తరగతి ఉద్యోగుల వేతనాల్లో కోత పెట్టారు. రిటైర్డ్‌ ఉద్యోగుల పెన్షన్‌లను కూడా తగ్గించారు. ఈ మేరకు ఆదివారం ప్రెస్‌మీట్‌లోనే ఉద్యోగులు కొన్ని త్యాగాలు చేయాల్సి ఉంటుందని కేసీఆర్‌ హింట్‌ ఇచ్చారు. ఈ కష్టకాలంలో నాలుగు కూరలతో తినే బదులు… రెండు కూరలతో తిందాం… లేకపోతే తొక్కు వేసుకుని తిందామని చెప్పారు. వేతనాల్లో కోత ఇలా ఉండబోతోంది…. ప్రభుత్వం తీసుకునే నిర్ణయానికి సహకరించాలని కోరారు.

  • ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర కార్పొరేషన్ చైర్ పర్సన్లు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల వేతనాల్లో 75 శాతం కోత.
  • ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ లాంటి అఖిల భారత సర్వీసు అధికారుల వేతనాల్లో 60 శాతం కోత
  • మిగతా అన్ని కేటగిరీల ఉద్యోగుల వేతనాల్లో 50 శాతం త‌గ్గింపు
  • నాలుగో తరగతి, ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల వేతనాల్లో 10 శాతం కుదించి చెల్లింపులు
  • అన్ని రకాల రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్లలో 50 శాతం క‌టింగ్
  • నాలుగో తరగతి రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ల‌లో 10 శాతం కోత
  • అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వ గ్రాంట్లు పొందుతున్న సంస్థల ఉద్యోగులకు, ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల మాదిరిగానే వేతనాల్లో కోత ఉంటుంద‌ని ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది.

తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రమైన ప్రభావం చూపుతున్నది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం…

Publiée par Telangana CMO sur Lundi 30 mars 2020

Tags:    
Advertisement

Similar News