వర్మ నెక్ట్స్ మూవీ "దిశ"

దేశాన్ని కుదిపేసే ఘటన ఏది జరిగినా దాన్ని సినిమాగా తీసేయడం వర్మకు అలవాటు. ముంబయి దాడులు, మాఫియా అంశాలు, కార్పొరేట్ లాబీయింగ్ పై ఇప్పటికే సినిమాలు తీసిన వర్మ.. ఇప్పుడు దిశ ఘటనపై దృష్టిపెట్టాడు. హైదరాబాద్ శివార్లలో జరిగిన ఈ దుర్ఘటన యావత్ దేశాన్ని కుదిపేసిన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పుడీ సబ్జెక్ట్ తో సినిమా తీయాలని వర్మ నిర్ణయించాడు. దిశ ఘటనపై తను సినిమా చేయబోతున్న విషయాన్ని వర్మ అధికారికంగా ప్రకటించాడు. దిశ ఘటన జరిగిన […]

Advertisement
Update:2020-02-01 11:25 IST

దేశాన్ని కుదిపేసే ఘటన ఏది జరిగినా దాన్ని సినిమాగా తీసేయడం వర్మకు అలవాటు. ముంబయి దాడులు, మాఫియా అంశాలు, కార్పొరేట్ లాబీయింగ్ పై ఇప్పటికే సినిమాలు తీసిన వర్మ.. ఇప్పుడు దిశ ఘటనపై దృష్టిపెట్టాడు. హైదరాబాద్ శివార్లలో జరిగిన ఈ దుర్ఘటన యావత్ దేశాన్ని కుదిపేసిన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పుడీ సబ్జెక్ట్ తో సినిమా తీయాలని వర్మ నిర్ణయించాడు.

దిశ ఘటనపై తను సినిమా చేయబోతున్న విషయాన్ని వర్మ అధికారికంగా ప్రకటించాడు. దిశ ఘటన జరిగిన ఓఆర్ఆర్ తదితర స్థలాల ఫొటోల్ని కూడా వర్మ షేర్ చేశాడు. తన సినిమాకు దిశ అనే టైటిల్ నే ఫిక్స్ చేసిన వర్మ.. దిశ ఘటన నుంచి దుర్మార్గులు ఏం నేర్చుకున్నారో దిశ చిత్రంలో భయంకరంగా చూపించబోతున్నానని ప్రకటించాడు.

నిర్భయను కదిలే బస్సులో అత్యాచారం చేసి రోడ్డుపై పడేశారు. అలా చేస్తే తమకు శిక్ష పడదని భావించారు. కానీ పోలీసులకు చిక్కారు. అలాంటి పరిస్థితి తమకు రాకూడదనే ఉద్దేశంతో దిశ దోషులు ఏకంగా దిశను సజీవ దహనం చేశారు. నిర్భయ దోషుల ఉరిశిక్ష వాయిదాను తీవ్రంగా ఖండించిన వర్మ.. దిశ సినిమాలో చట్టాలు-లొసుగులపై కూడా చర్చిస్తానని ప్రకటించాడు.

Tags:    
Advertisement

Similar News