టెలికాంను దెబ్బతీస్తున్న మోడీ..

జియో రాకతో మొత్తం టెలికాం పరిశ్రమలో ఉచిత ఆఫర్ల పోటీ పెరిగింది. జియో ఆఫర్ల దెబ్బకు… మిగతా కంపెనీలు నష్టాల బాట పడుతున్నాయి. కేంద్రం స్పెక్ట్రమ్ పన్నుల పేరిట లక్షల కోట్లు చెల్లించాలని ఇచ్చిన నోటీసులతో ఇప్పటికే తాము భరించలేమని చేతులెత్తేసిన సంగతి తెలిసిందే. గోరుచుట్టుపై రోకలి పోటులా మోడీ వ్యవహరిస్తున్న తీరుతో టెలికాం కంపెనీలు కుదేలవుతున్నాయి. ఇప్పటికే నష్టాల బాటపట్టిన టెలికాం పరిశ్రమకు మోడీ చేస్తున్న చట్ట వ్యతిరేక బిల్లులతో మరింత నష్టాల బాటపడుతున్నాయట. తాజాగా […]

Advertisement
Update:2019-12-28 07:13 IST

జియో రాకతో మొత్తం టెలికాం పరిశ్రమలో ఉచిత ఆఫర్ల పోటీ పెరిగింది. జియో ఆఫర్ల దెబ్బకు… మిగతా కంపెనీలు నష్టాల బాట పడుతున్నాయి. కేంద్రం స్పెక్ట్రమ్ పన్నుల పేరిట లక్షల కోట్లు చెల్లించాలని ఇచ్చిన నోటీసులతో ఇప్పటికే తాము భరించలేమని చేతులెత్తేసిన సంగతి తెలిసిందే.

గోరుచుట్టుపై రోకలి పోటులా మోడీ వ్యవహరిస్తున్న తీరుతో టెలికాం కంపెనీలు కుదేలవుతున్నాయి. ఇప్పటికే నష్టాల బాటపట్టిన టెలికాం పరిశ్రమకు మోడీ చేస్తున్న చట్ట వ్యతిరేక బిల్లులతో మరింత నష్టాల బాటపడుతున్నాయట.

తాజాగా పౌరసత్వ సవరణ చట్టం సహా ఎన్నార్సీని తెరపైకి తెచ్చిన కేంద్రం వైఖరితో… దేశవ్యాప్తంగా అట్టుడుకుతోంది. యూపీ సహా ఈశాన్య రాష్ట్రాలు, బెంగాల్, ఇతర రాష్ట్రాల్లో తీవ్ర హింసకు పాల్పడడంతో అక్కడ ఇంటర్నెట్ సేవలను మోడీ సర్కార్ నిలిపివేసింది.

ఇక అంతకుముందు కశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దుతో రెండు నెలల పాటు ఇంటర్నెట్, ఫోన్ సేవలు నిలిచిపోయాయి. ఇలా వరుసగా చట్టవ్యతిరేక బిల్లుల కారణంగా ఆందోళనలు చెలరేగడం.. మోడీ సర్కార్ చీటికి మాటికీ ఇంటర్నెట్, ఫోన్ సేవలను నిలిపేస్తుండడంతో టెలికాం పరిశ్రమ కోట్లలోనే నష్టాల పాలవుతోందట.. మోడీ బిల్లులు తెస్తామంటే చాలు ఇప్పుడు టెలికాం పరిశ్రమ బెంబేలెత్తిపోతోందట.

Tags:    
Advertisement

Similar News