బాగ్దాదీ వేటకు 'ఆపరేషన్ కైలా ముల్లెర్' అనే పేరెందుకు పెట్టారో తెలుసా..?

ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా అంటే చాలా మందికి అర్థం కాకపోవచ్చు. కాని ఐసిస్ అని చెబితే ఎవరైనా చెబుతారు. ప్రపంచంలోనే అత్యంత కిరాతకమైన తీవ్రవాదుల గ్రూప్ అది. మహిళలను అయితే కిడ్నాప్ చేసి అత్యాచారం చేయడం… పురుషులనైతే వీడియో చిత్రీకరిస్తూ మరి పీకలు కోయడం వీరి కౄరత్వానికి పరాకాష్ట. వీరిని అంతమొందించాలని అమెరికా సహా పలు దేశాలు గత కొన్నేళ్లుగా ప్రయాత్నిస్తూనే ఉన్నాయి. కాని ఎవరి వల్లా కాలేదు. ఇక లాభం లేదు.. […]

Advertisement
Update:2019-10-28 10:20 IST

ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా అంటే చాలా మందికి అర్థం కాకపోవచ్చు. కాని ఐసిస్ అని చెబితే ఎవరైనా చెబుతారు. ప్రపంచంలోనే అత్యంత కిరాతకమైన తీవ్రవాదుల గ్రూప్ అది. మహిళలను అయితే కిడ్నాప్ చేసి అత్యాచారం చేయడం… పురుషులనైతే వీడియో చిత్రీకరిస్తూ మరి పీకలు కోయడం వీరి కౄరత్వానికి పరాకాష్ట. వీరిని అంతమొందించాలని అమెరికా సహా పలు దేశాలు గత కొన్నేళ్లుగా ప్రయాత్నిస్తూనే ఉన్నాయి. కాని ఎవరి వల్లా కాలేదు.

ఇక లాభం లేదు.. ఐసిస్ ఛీఫ్‌నే లేపేస్తే.. మిగిలిన మంద అంతా చెల్లాచెదురై పోతుందని అమెరికా భావించింది. ఒకప్పుడు తాను అండదండలు అందించిన ఐసిస్‌ను తానే అంతం చేయాలని ఒక ఆపరేషన్ స్టార్ట్ చేసింది. దానికి ‘ఆపరేషన్ కైలా ముల్లెర్’ అనే పేరు పెట్టింది. ఈ కోడ్ నేమ్‌తోనే గత కొన్ని నెలలుగా బాగ్దాదీ కోసం వేట ప్రారంభించింది.

ఈ కైలా ముల్లెర్ ఎవరు..? ఈ ఆపరేషన్‌ని లీడ్ చేసిన వ్యక్తా..? లేదా మరేదైనా ప్రత్యేకత ఉందా?.. అంటే మనం ఆరేళ్లు వెనకకు వెళ్లాలి.

అమెరికాలోని అరిజోనాకు చెందిన 26 ఏండ్ల కైలా ముల్లెర్ ఒక సేవా సంస్థలో పని చేస్తుండేది. ఒక ఆసుపత్రిలో విధులు నిర్వర్తించేందుకు గాను 2013లో టర్కీ నుంచి అలెప్పోకు ప్రయాణిస్తోంది. అప్పుడు ఆమె ప్రయాణిస్తున్న వాహనాన్ని ఐసిస్ ఉగ్రవాదులు అడ్డుకొని కైలాను కిడ్నాప్ చేశారు. అమెరికా దాడిలో చనిపోయిన బాగ్దాదీనే కైలాను అత్యాచారం చేసి అత్యంత దారుణంగా చంపేశాడు.

ఈ ఘటన 2013లో జరిగితే అమెరికాకు మాత్రం 2015లో తెలిసింది. ఐసిస్ ఆమెను అత్యాచారం చేసి చంపేసిందని అమెరికా నిర్థారించుకున్నా సరే.. ఐసిస్ మాత్రం మేం చంపలేదని.. రక్కాలో జరిగిన వైమానిక దాడిలో మరణించిందంటూ అబద్దాలు చెప్పింది. కాని అమెరికా ఐసిస్ మాటలు నమ్మలేదు.

ఎంతో మందిని విచారించిన తర్వాత కైలా ఎలా మరణించిందో నిర్థారించుకొని.. బాగ్దాదీ వేటకు ఆమె పేరునే పెట్టింది. లక్షాలాది మంది అమాయకుల ప్రాణాలను తీసిన ఒక నరహంతకుడిని చంపడానికే…. కైలా ముల్లెర్ పేరును వాడింది. ఆ విధంగా ఆమెకు ఘన నివాళి అందించింది.

Tags:    
Advertisement

Similar News