పాకిస్తాన్ సరిహద్దులో భారీ భూకంపం

రిక్టర్ స్కేల్‌పై 6.3 గా నమోదైన బలమైన భూకంపం ఇండియా-పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతంలో సాయంత్రం 4.32 గంటలకు సంభవించిందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఢిల్లీ, నోయిడా,గుర్‌గావ్, చండీగర్, ఉత్తర ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, పంజాబ్ లలో కూడా ఈ ప్రకంపనలు సంభవించాయి. భారతదేశంలో భూకంపం కారణంగా ఇప్పటివరకు ఎటువంటి ప్రాణ నష్టం లేదా ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం లేదు. యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే ప్రకారం… పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లోని మీర్పూర్ కి 1 […]

Advertisement
Update:2019-09-24 14:15 IST

రిక్టర్ స్కేల్‌పై 6.3 గా నమోదైన బలమైన భూకంపం ఇండియా-పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతంలో సాయంత్రం 4.32 గంటలకు సంభవించిందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఢిల్లీ, నోయిడా,గుర్‌గావ్, చండీగర్, ఉత్తర ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, పంజాబ్ లలో కూడా ఈ ప్రకంపనలు సంభవించాయి. భారతదేశంలో భూకంపం కారణంగా ఇప్పటివరకు ఎటువంటి ప్రాణ నష్టం లేదా ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం లేదు.

యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే ప్రకారం… పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లోని మీర్పూర్ కి 1 కిలోమీటర్ ఆగ్నేయంలో 5.8 తీవ్రతతో భూకంపం 10 కిలోమీటర్ల లోతులో ఏర్పడింది. భూకంపం కారణంగా ఈ ప్రాంతంలోని రోడ్ నెట్‌వర్క్‌లు తీవ్రంగా దెబ్బతిన్నందున మీర్‌పూర్‌లో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ప్రాధమిక నివేదికల ప్రకారం, మీర్‌పూర్‌లో భూకంపం కారణంగా సుమారు 50 మంది గాయపడ్డారు.

యూరోపియన్-మెడిటరేనియన్ సీస్మోలాజికల్ సెంటర్ రిక్టర్ స్కేల్ పై 6.3 తీవ్రతతో భూకంపం సాయంత్రం 4:33 గంటలకు పాకిస్తాన్ లోని లాహోర్ కు 173 కిలోమీటర్ల వాయువ్య ప్రాంతంలో సంభవించింది.

ఇస్లామాబాద్, రావల్పిండి, ముర్రీ, జీలం, చార్సద్దా, స్వాత్, ఖైబర్, అబోటాబాద్, బజౌర్, నౌషెరా, మన్సెరా, బట్టగ్రామ్, టోర్ఘర్, కొహితాన్ లలో ప్రకంపనలు సంభవించాయని జియో టీవీ నివేదించింది. డాన్ పత్రిక ప్రకారం, పాకిస్తాన్ లోని వివిధ ప్రాంతాల్లో ఈ ప్రకంపనలు 8-10 సెకన్ల పాటు కొనసాగాయి.

పాకిస్తాన్ వాతావరణ శాఖ భూకంప కేంద్రంలో డిప్యూటీ డైరెక్టర్ నజీబ్ అహ్మద్ డాన్ న్యూస్‌టివితో మాట్లాడుతూ భూకంపం రిక్టర్ స్కేల్‌పై 5.8 గా ఉందని, 10 కిలోమీటర్ల లోతులో ఉందని చెప్పారు

Tags:    
Advertisement

Similar News