యాషెస్ సిరీస్ లో నేటినుంచే ఆఖరాట

ఓవల్ వేదికగా మరికాసేపట్లో చివరి టెస్ట్  ఐదుమ్యాచ్ ల సిరీస్ లో ఆసీస్ 2-1తో పైచేయి చిరకాల ప్రత్యర్థులు ఇంగ్లండ్- ఆస్ట్ర్రేలియాజట్ల పాంచ్ పటాకా యాషెస్ టెస్ట్ సిరీస్ ముగింపు దశకు చేరింది. మొదటి నాలుగు టెస్టుల్లో ఆస్ట్ర్రేలియా 2-1తో పైచేయి సాధించడమే కాదు…18 ఏళ్ల తర్వాత ఇంగ్లండ్ గడ్డపై సిరీస్ ను ఖాయం చేసుకొన్న ఆత్మవిశ్వాసంతో ఆఖరి టెస్ట్ బరిలోకి దిగుతోంది. మరోవైపు ఆతిథ్య ఇంగ్లండ్ మాత్రం కనీసం ఆఖరి టెస్టులోనైనా నెగ్గి 2-2తో సమఉజ్జీగా నిలవాలన్న పట్టుదలతో […]

Advertisement
Update:2019-09-12 02:33 IST
  • ఓవల్ వేదికగా మరికాసేపట్లో చివరి టెస్ట్
  • ఐదుమ్యాచ్ ల సిరీస్ లో ఆసీస్ 2-1తో పైచేయి

చిరకాల ప్రత్యర్థులు ఇంగ్లండ్- ఆస్ట్ర్రేలియాజట్ల పాంచ్ పటాకా యాషెస్ టెస్ట్ సిరీస్ ముగింపు దశకు చేరింది. మొదటి నాలుగు టెస్టుల్లో ఆస్ట్ర్రేలియా 2-1తో పైచేయి సాధించడమే కాదు…18 ఏళ్ల తర్వాత ఇంగ్లండ్ గడ్డపై సిరీస్ ను ఖాయం చేసుకొన్న ఆత్మవిశ్వాసంతో ఆఖరి టెస్ట్ బరిలోకి దిగుతోంది.

మరోవైపు ఆతిథ్య ఇంగ్లండ్ మాత్రం కనీసం ఆఖరి టెస్టులోనైనా నెగ్గి 2-2తో సమఉజ్జీగా నిలవాలన్న పట్టుదలతో ఉంది. లండన్ లోని ఓవల్ స్టేడియం వేదికగా మరికొద్దిగంటల్లో ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ లో జో రూట్ నాయకత్వంలోని ఇంగ్లండ్ రెండు మార్పులతో పోటీకి దిగుతోంది.

ఓపెనర్ జేసన్ రాయ్, ఫాస్ట్ బౌలర్ క్రెగ్ ఓవర్టన్ లను తప్పించి వారి స్థానాలలో..ఆల్ రౌండర్లు సామ్ కరెన్, క్రిస్ వోక్స్ లకు చోటు కల్పించింది.

కంగారూజట్టులో మిషెల్ మార్ష్..

ఇప్పటికే 2-1తో సిరీస్ ఖాయం చేసుకొన్న ఆస్ట్ర్రేలియా ఆఖరిటెస్టులో సైతం విజయం సాధించాలన్న పట్టుదలతో ఉంది. వైస్ కెప్టెన్ ట్రావిస్ హెడ్ కు విశ్రాంతి ఇచ్చి… అతని స్థానంలో ఫాస్ట్ బౌలింగ్ ఆల్ రౌండర్ మిషెల్ మార్ష్ కు తుదిజట్టులో చోటు కల్పించింది.

స్టీవ్ స్మిత్ వైపే చూపు…

సిరీస్ లోని మొదటి నాలుగు టెస్టుల్లో రెండు సెంచరీలు, ఓ డబుల్ సెంచరీతో సహా 671 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచిన స్టీవ్ స్మిత్ …. ప్రస్తుత ఆఖరిటెస్టులో సైతం కీలకపాత్ర పోషించనున్నాడు.

తనజట్టుకు సింగిల్ హ్యాండెడ్ గా సిరీస్ అందించిన స్మిత్ ను కట్టడి చేయటమే లక్ష్యంగా ఇంగ్లండ్ తాజావ్యూహాలతో ఆఖరాటకు సిద్ధమయ్యింది.

మరోవైపు కంగారూ ఫాస్ట్ బౌలింగ్ జోడీ జోష్ హేజిల్ వుడ్, పాట్ కమిన్స్ కలసి 42 వికెట్లు పడగొట్టడం ద్వారా ఇంగ్లండ్ కు ప్రధాన అడ్డంకిగా మారారు.

మొత్తం మీద నేలవిడిచి సాము చేస్తున్న కంగారూ టీమ్ 2-1తో ఆధిక్యం సాధించడం ద్వారా తానేమిటో నిరూపించుకోగలిగింది.

Tags:    
Advertisement

Similar News