శ్రీనివాస్ రెడ్డి సూసైడ్ లెటర్స్‌లో వేర్వేరు చేతిరాతలు
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఏం జరుగుతోందో బయటి ప్రపంచానికి అంతుచిక్కడం లేదు. ఈ కేసును పోలీసులు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని పనిచేస్తున్నారు. అదే సమయంలో అత్యంత గోప్యంగా కేసును కొలిక్కి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటికే ప్రత్యేక బృందాలు మూడు నెలలుగా ఇదే పని మీద ఉన్నాయి. అయితే శ్రీనివాస్ రెడ్డి అనే అనుమానితుడు సూసైడ్ చేసుకోవడంతో మరోసారి ఈ కేసుపై అందరి దృష్టి పడింది. అసలేం జరుగుతోంది అన్న దానిపై ప్రజలు చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో […]
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఏం జరుగుతోందో బయటి ప్రపంచానికి అంతుచిక్కడం లేదు. ఈ కేసును పోలీసులు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని పనిచేస్తున్నారు. అదే సమయంలో అత్యంత గోప్యంగా కేసును కొలిక్కి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి.
ఇప్పటికే ప్రత్యేక బృందాలు మూడు నెలలుగా ఇదే పని మీద ఉన్నాయి. అయితే శ్రీనివాస్ రెడ్డి అనే అనుమానితుడు సూసైడ్ చేసుకోవడంతో మరోసారి ఈ కేసుపై అందరి దృష్టి పడింది. అసలేం జరుగుతోంది అన్న దానిపై ప్రజలు చర్చించుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో వీలైనంత త్వరగా కేసును తేల్చాలని పోలీసులు భావిస్తున్నారు. శ్రీనివాస్ రెడ్డి ఆత్మహత్య నేపథ్యంలో డీజీపీ స్వయంగా పులివెందులకు వెళ్లి రోజంతా ఈ కేసు అంశంపై అధికారులతో సుధీర్ఘంగా చర్చించారు. వివేకానందరెడ్డి హత్యకు గురైన ఇంటిని పరిశీలించారు. అనంతరం వివేకా అల్లుడితోనూ భేటీ అయ్యారు. కలెక్టర్‌తోనూ సమావేశం నిర్వహించారు డీజీపీ. అనుమానితుడు శ్రీనివాస్ రెడ్డి ఆత్మహత్య చేసుకోవడంపై డీజీపీ అసంతృప్తి వ్యక్తం చేశారు. అతడిపై ఎందుకు నిఘా ఉంచలేకపోయారని పోలీసులను డీజీపీ ప్రశ్నించారు.
ఇదే సమయంలో ఆత్మహత్యకు ముందు శ్రీనివాస్ రెడ్డి రాసినట్టుగా భావిస్తున్న రెండు సూసైడ్ నోట్లలో వేర్వేరు చేతి రాతలు ఉండడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. వేర్వేరు చేతిరాతలు ఉన్నాయి అంటే తప్పని సరిగా ఈ ఆత్మహత్య వెనుక ఏదో మిస్టరీ ఉంటుందని పోలీసులు నిర్ధారణకు వచ్చారు.
ఒక లేఖ శ్రీనివాస్ రెడ్డి రాసినా… మరో చేతిరాత ఎవరిది అన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కేసులో పోలీసులను ఆత్మరక్షణలో పడేసేందుకు అసలు నేరస్తులే శ్రీనివాస్ రెడ్డి ఆత్మహత్యకు ప్రేరేపించారా? లేక మరో కోణం ఏమైనా ఉందా? అన్న దిశగా ఆరా తీస్తున్నారు.
సిట్ అధికారులు చెప్పిన వివరాలన్నింటిని డీజీపీ స్వయంగా నోట్ చేసుకున్నారు. ఈ వివరాలతో ముఖ్యమంత్రికి నివేదిక ఇచ్చే అవకాశం ఉంది.
ఇప్పటికే సేకరించిన సాక్ష్యాలతో నిందితులను అరెస్ట్ చేయడమా లేక మరింత లోతుగా వెళ్లి పక్కాగా అరెస్ట్‌లు చేయడమా అన్న అంశంపై పోలీసులు ఇంకా ఒక నిర్ణయానికి రాలేకపోతున్నారు.