తిరగబడుతున్న మోడీ సర్కార్ లెక్కలు... భారీ కార్ల కొనుగోలుకు నిర్ణయం
దేశ ఆర్ధిక వ్యవస్థకు గతంలో ఎన్నడూ లేనంత ముప్పు ముంచుకొస్తోంది. దేశంలో కొనుగోళ్లు, అమ్మకాలు దారుణంగా పడిపోయాయి. దీంతో దేశం ఆర్ధిక మాంద్యం వైపు పరుగులు తీస్తుండడంతో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు దిగింది. ప్రభుత్వ బ్యాంకులకు 70వేల కోట్ల నిధులు అందించేందుకు కేంద్రం అంగీకరించింది. అటు కుదేలైన ఆటో మొబైల్ రంగానికి ప్రభుత్వమే అతిపెద్ద కొనుగోలు దారుగా మారి పంట పడించేందుకు సిద్ధమైంది. డిజిల్, పెట్రోల్ వాహనాల స్థానంలో ఎలక్ట్రిక్ వాహనాలను పూర్తి స్థాయిలో తీసుకురావాలన్న ఉత్సాహంతో […]
దేశ ఆర్ధిక వ్యవస్థకు గతంలో ఎన్నడూ లేనంత ముప్పు ముంచుకొస్తోంది. దేశంలో కొనుగోళ్లు, అమ్మకాలు దారుణంగా పడిపోయాయి. దీంతో దేశం ఆర్ధిక మాంద్యం వైపు పరుగులు తీస్తుండడంతో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు దిగింది. ప్రభుత్వ బ్యాంకులకు 70వేల కోట్ల నిధులు అందించేందుకు కేంద్రం అంగీకరించింది.
అటు కుదేలైన ఆటో మొబైల్ రంగానికి ప్రభుత్వమే అతిపెద్ద కొనుగోలు దారుగా మారి పంట పడించేందుకు సిద్ధమైంది. డిజిల్, పెట్రోల్ వాహనాల స్థానంలో ఎలక్ట్రిక్ వాహనాలను పూర్తి స్థాయిలో తీసుకురావాలన్న ఉత్సాహంతో ప్రభుత్వం… వాహనాల వన్‌టైం రిజిస్ట్రేషన్ చార్జీలను ఆ మధ్య భారీగా పెంచేసింది. దీంతో మొదటికే మోసం వచ్చింది. ప్రజలంతా కార్లు కొనుగోలుపై ఉత్సాహం తగ్గించారు. దాంతో ఆటోమొబైల్ రంగం కుదేలైంది.
పర్యావరణ పరంగా ఇది మంచేది అయినా… పరిస్థితి మరోలా దారి తీయడంతో కేంద్రమే స్వయంగా వాహనాల కొనుగోలుకు అంగీకరించింది. ఆటోమొబైల్ రంగాన్ని గట్టెక్కించేందుకు కేంద్ర ప్రభుత్వం భారీగా కార్లు, వాహనాలు కొనుగోలు చేయబోతోంది. పాత వాటిని పక్కన పడేసి కొత్త వాహనాలను కొనుగోలు చేసేందుకు నిర్ణయం తీసుకుంది.
ప్రభుత్వంలో కొత్త వాహనాల కొనుగోలుపై విధించిన ఆంక్షలను ఎత్తివేసింది. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతోంది. ప్రజల సొమ్మును ప్రైవేట్ కంపెనీలను గట్టెక్కించేందుకు ఎలా వాడుతారన్న ప్రశ్నలు వస్తున్నాయి. ఇంతకాలం పొదుపు కథలు చెప్పి ఇప్పుడు భారీగా కొత్త కార్లను ప్రభుత్వం కొనుగోలు చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.