సోషల్ మీడియా లో ఫేమస్ అవుదామని...
సోషల్ మీడియా లో ఫేమస్ అవ్వడానికి ఎన్ని అవకాశాలు ఉంటే అన్నింటిని వినియోగించుకుంటున్నారు నెటిజన్లు. ఈ పిచ్చిలో పడి కొందరు అత్యంత ప్రమాదకరమైన ఫీట్లు చేస్తున్నారు. కొందరు ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారు. అటువంటివే ఈ కుర్రోడు చేసేవి కూడా. ఈ మధ్య యూ ట్యూబ్ లో రైలు పట్టాలపై అనేక వస్తువులు ఉంచి రైలు వచ్చినప్పుడు అవి స్మాష్ అవుతుంటే వీడియో తీసి యూట్యూబ్ లో ఉంచుతున్న వీడియోలు ఎక్కువయ్యాయి. అందులో కొన్ని వైరల్ అయ్యాయి. రైల్వే […]
సోషల్ మీడియా లో ఫేమస్ అవ్వడానికి ఎన్ని అవకాశాలు ఉంటే అన్నింటిని వినియోగించుకుంటున్నారు నెటిజన్లు. ఈ పిచ్చిలో పడి కొందరు అత్యంత ప్రమాదకరమైన ఫీట్లు చేస్తున్నారు. కొందరు ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారు. అటువంటివే ఈ కుర్రోడు చేసేవి కూడా.
ఈ మధ్య యూ ట్యూబ్ లో రైలు పట్టాలపై అనేక వస్తువులు ఉంచి రైలు వచ్చినప్పుడు అవి స్మాష్ అవుతుంటే వీడియో తీసి యూట్యూబ్ లో ఉంచుతున్న వీడియోలు ఎక్కువయ్యాయి. అందులో కొన్ని వైరల్ అయ్యాయి.
రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ పోలీసులు వీటిని గమనించి ఈ పని ఎవరు చేస్తున్నారా? అని ఆరా తీసినా చాలా రోజుల వరకు ఫలితం లేదు.
ఈ వీడియో తీసే వ్యక్తి కూరగాయలు, మాంసం, ఆటబొమ్మలు, బైకులు, గాస్ సిలిండర్లు, క్రాకర్స్ వంటి వాటిని రైలు పట్టాలపై ఉంచుతున్నాడు. ఇందులో కొన్ని చాలా ప్రమాదకరమైనవి. ఒకసారి రైల్వే పోలీసులు రైలు పట్టాలపై ఉంచిన బైక్ రిజిస్ట్రేషన్ నంబర్ ఆధారం గా ఈ నిర్వాకం చేస్తున్న వ్యక్తి ని గుర్తించారు. వెంటనె అతడిని ఆదివారం ఆరెస్ట్ చేశారు.
ఈ తుంటరి ఎవరో కాదు. మన తెలుగువాడే. రైల్వే పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం… చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం చెల్లూరు గ్రామానికి చెందిన ఇంజినీరింగ్ గ్రడ్యుయేట్ ఇతడు. పేరు కొంగర రామిరెడ్డి. ఇట్లా ఎందుకు చేస్తున్నావని అతడిని ప్రశ్నిస్తే ఫేమస్ అవ్వడానికని బదులిచ్చాడట.
తన ఇంటి సమీపం లో ఉన్న రైల్వే ట్రాక్ పై అనలోచితమైన ఈ ప్రమాదకర పనులు చేస్తూ నిజం గానే ఫేమస్ అయ్యాడు. కానీ బంగారం లాంటి భవిష్యత్ ని నాశనం చేసుకున్నాడు.