యాషెస్ సిరీస్ కు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ రెడీ

ఆగస్టు 1 నుంచి 5మ్యాచ్ ల యాషెస్ వార్  2001 తర్వాత ఇంగ్లండ్ గడ్డపై యాషెస్ విజయానికి కంగారూల తహతహ శతాబ్దాల చరిత్ర కలిగిన టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే అత్యంత పురాతన ద్వైపాక్షిక సమరం యాషెస్ సిరీస్ కు చిరకాల ప్రత్యర్థులు ఇంగ్లండ్, ఆస్ట్ర్లేలియాజట్లు.. సై అంటే సై అంటున్నాయి. ఆగస్టు 1 నుంచి జరిగే ఈ ఐదుమ్యాచ్ ల సిరీస్ కు ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు ఆతిథ్యమిస్తోంది. ఐసీసీ టెస్ట్ చాంపియన్షిప్ లో భాగంగా యాషెస్ […]

Advertisement
Update:2019-07-28 02:47 IST
  • ఆగస్టు 1 నుంచి 5మ్యాచ్ ల యాషెస్ వార్
  • 2001 తర్వాత ఇంగ్లండ్ గడ్డపై యాషెస్ విజయానికి కంగారూల తహతహ

శతాబ్దాల చరిత్ర కలిగిన టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే అత్యంత పురాతన ద్వైపాక్షిక సమరం యాషెస్ సిరీస్ కు చిరకాల ప్రత్యర్థులు ఇంగ్లండ్, ఆస్ట్ర్లేలియాజట్లు.. సై అంటే సై అంటున్నాయి.

ఆగస్టు 1 నుంచి జరిగే ఈ ఐదుమ్యాచ్ ల సిరీస్ కు ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు ఆతిథ్యమిస్తోంది. ఐసీసీ టెస్ట్ చాంపియన్షిప్ లో భాగంగా యాషెస్ సిరీస్ ను తొలిసారిగా నిర్వహిస్తున్నారు.

హేమాహేమీలతో కంగారూ టీమ్…

యాషెస్ సిరీస్ కు ..టిమ్ పెయిన్ నాయకత్వంలోని 17 మంది సభ్యుల కంగారూ జట్టును క్రికెట్ ఆస్ట్ర్రేలియా ప్రకటించింది. బాల్ టాంపరింగ్ వివాదంలో చిక్కుకొని ఏడాది నిషేధానికి గురైన మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్, వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్, ఓపెనర్ బాన్ క్రాఫ్ట్ తిరిగి ఆస్ట్ర్రేలియా జట్టులో చోటు సంపాదించగలిగారు.

కంగారూ జట్టులోని ఇతర ఆటగాళ్లలో పాట్ కమిన్స్, మిషెల్ స్టార్క్, మార్కుస్ హారిస్, జోష్ హేజిల్ వుడ్, ట్రావిడ్ హెడ్, మార్నుస్ సాబ్నుచేజ్, నేథన్ లయన్, మిషెల్ మార్ష్, మైకేల్ నెసెర్, జేమ్స్ పాటిన్ సన్, పీటర్ సిడిల్, మాథ్యూ వేడ్ ఉన్నారు.

ఇంగ్లండ్ జట్టులో జోఫ్రా ఆర్చర్…

యాషెస్ సిరీస్ లోని తొలిటెస్టులో పాల్గొనే 14 మంది సభ్యుల ఇంగ్లండ్ జట్టులో సైతం జోఫ్రా ఆర్చర్ కు చోటు దక్కింది. జో రూట్ నాయకత్వంలోని ఇంగ్లండ్ జట్టుకు ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ వైస్ కెప్టెన్ గా నియమించారు.

జట్టులోని ఇతర ఆటగాళ్లలో మోయిన్ అలీ, జేమ్స్ యాండర్సన్, జానీ బెయిర్ స్టో, స్టువర్ట్ బ్రాడ్, రోరీ బర్న్స్, జోస్ బట్లర్, సామ్ కరెన్, జో డెన్లే, జేసన్ రాయ్, వోలీ స్టోన్స్, క్రిస్ వోక్స్.

ఇదీ యాషెస్ సిరీస్ షెడ్యూల్…

ఆగస్టు 1-5 బర్మింగ్ హామ్ లో తొలిటెస్ట్
ఆగస్టు 14-18 లార్డ్స్ వేదికగా రెండో టెస్ట్
ఆగస్టు 22 -26 హెడింగ్లేలో మూడో టెస్ట్
సెప్టెంబర్ 4-8 ఓల్డ్ ట్రాఫర్డ్ లో నాలుగో టెస్ట్
సెప్టెంబర్ 12-16 ఓవల్ లో ఆఖరి టెస్ట్

Tags:    
Advertisement

Similar News