కోడెల ఫ్యామిలీకి హైకోర్టులో చుక్కెదురు

టీడీపీ హయాంలో నరసరావుపేట, సత్తెనపల్లి నియోజక వర్గాల్లో విచ్చలవిడిగా ‘కే ట్యాక్స్’ పేరుతో డబ్బులు వసూలు చేయడంతో పాటు… పలువురిని బెదిరించి మోసం చేసిన వ్యవహారంలో కోడెల కుటుంబం పూర్తిగా కూరుకుపోతోంది. ఇప్పటికే 10కిపైగా కేసులు నమోదు అయ్యాయి. ఈ నేపథ్యంలో కొంతకాలంగా కోడెల కుమార్తె, కుమారుడు అజ్ఞాతంలో ఉన్నారు. అరెస్ట్‌ తప్పదన్న భయంతో ముందస్తు బెయిల్‌ కోసం స్థానిక కోర్టును ఆశ్రయించారు. అయితే అక్కడ వారికి చుక్కెదురైంది. పలు కేసుల్లో నిందితులుగా ఉన్న కోడెల శివరాం, […]

Advertisement
Update:2019-06-26 02:23 IST

టీడీపీ హయాంలో నరసరావుపేట, సత్తెనపల్లి నియోజక వర్గాల్లో విచ్చలవిడిగా ‘కే ట్యాక్స్’ పేరుతో డబ్బులు వసూలు చేయడంతో పాటు… పలువురిని బెదిరించి మోసం చేసిన వ్యవహారంలో కోడెల కుటుంబం పూర్తిగా కూరుకుపోతోంది.

ఇప్పటికే 10కిపైగా కేసులు నమోదు అయ్యాయి. ఈ నేపథ్యంలో కొంతకాలంగా కోడెల కుమార్తె, కుమారుడు అజ్ఞాతంలో ఉన్నారు. అరెస్ట్‌ తప్పదన్న భయంతో ముందస్తు బెయిల్‌ కోసం స్థానిక కోర్టును ఆశ్రయించారు. అయితే అక్కడ వారికి చుక్కెదురైంది.

పలు కేసుల్లో నిందితులుగా ఉన్న కోడెల శివరాం, కోడెల కూతురు విజయలక్ష్మి, వారి అనుచరులు నాగప్రదాస్, కల్యాణం రాంబాబు, మరో ఇద్దురు దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. ఈ నేపథ్యంలో పోలీసులు అరెస్ట్ చేసినా ఆశ్చర్యం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Tags:    
Advertisement

Similar News