1993లో షేన్ వార్న్...2019లో కుల్దీప్ యాదవ్

క్రికెట్ చరిత్రలో స్పిన్ బౌలర్ల అత్యంత అరుదైన బంతులు పాక్ తో ప్రపంచకప్ మ్యాచ్ లో కుల్దీప్ మ్యాజిక్ బాల్  కుల్దీప్ స్పిన్ జాదూలో బాబర్ అజం గల్లంతు క్రికెట్ ఫార్మాట్ ఏదైనా…నాణ్యమైన స్పిన్ బౌలర్లు తమ ప్రతిభనంతా ఉపయోగించి మ్యాజిక్ బాల్స్ వేస్తుంటే ఆ మజాయే వేరు. అయితే.. మ్యాచ్ ను మలుపుతిప్పే అసాధారణ ఆఫ్ బ్రేక్, లెగ్ బ్రేక్ లు చూడాలంటే సంవత్సరాల తరబడి వేచిచూడక తప్పదు. 1993లో షేన్ వార్న్ జాదూ… మాంచెస్టర్ లోని […]

Advertisement
Update:2019-06-18 09:49 IST
  • క్రికెట్ చరిత్రలో స్పిన్ బౌలర్ల అత్యంత అరుదైన బంతులు
  • పాక్ తో ప్రపంచకప్ మ్యాచ్ లో కుల్దీప్ మ్యాజిక్ బాల్
  • కుల్దీప్ స్పిన్ జాదూలో బాబర్ అజం గల్లంతు

క్రికెట్ ఫార్మాట్ ఏదైనా…నాణ్యమైన స్పిన్ బౌలర్లు తమ ప్రతిభనంతా ఉపయోగించి మ్యాజిక్ బాల్స్ వేస్తుంటే ఆ మజాయే వేరు. అయితే.. మ్యాచ్ ను మలుపుతిప్పే అసాధారణ ఆఫ్ బ్రేక్, లెగ్ బ్రేక్ లు చూడాలంటే సంవత్సరాల తరబడి వేచిచూడక తప్పదు.

1993లో షేన్ వార్న్ జాదూ…

మాంచెస్టర్ లోని ఓల్డ్ ట్రాఫర్డ్ స్టేడియం వేదికగా 23 సంవత్సరాల క్రితం ఇంగ్లండ్ తో ముగిసిన టెస్ట్ మ్యాచ్ లో…ఆస్ట్రేలియా స్పిన్ మాంత్రికుడు షేన్ వార్న్ ఓ అసాధారణ లెగ్ బ్రేక్ తో మైక్ గాటింగ్ ను అవుట్ చేసిన తీరును క్రికెట్ అభిమానులు, పండితులు, విశ్లేషకులు ఇప్పటికీ గుర్తు చేసుకొంటూనే ఉంటారు.

వార్న్ వేసిన ఆ అనూహ్యమైన లెగ్ బ్రేక్ కు ..బాల్ ఆఫ్ ది సెంచరీగా ముద్దుపేరు పెట్టి మరీ గుర్తు చేసుకొంటున్నారు.
1993 టెస్ట్ మ్యాచ్ లో వార్న్ వేసిన బాల్ ఆఫ్ ద సెంచరీ..లేగ్ బ్రేక్ పిచ్ మీద పడిన వెంటనే అనూహ్యంగా 14 డిగ్రీల మేర బొంగరంలా మెలికలు తిరిగి మరీ…గాటింగ్ ఆఫ్ స్టంప్ బెయిల్ ను పడగొట్టింది. క్రికెట్ చరిత్రలోనే వార్న్ సంధించిన ఆ లెగ్ బ్రేక్.. ఓ అసాధారణ బాల్ గా నిలిచిపోయింది.

2019లో కుల్దీప్ యాదవ్…

వార్న్ బాల్ ఆఫ్ ది సెంచరీ ఘటన చోటు చేసుకొన్న ఓల్డ్ ట్రాఫర్డ్ స్టేడియంలోనే…2019 ప్రపంచకప్ లీగ్ పోటీలలో భాగంగా పాకిస్థాన్ తో ముగిసిన మ్యాచ్ లో…భారత చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్…ఓ జాదూ ఆఫ్ బ్రేక్ తో వన్ డౌన్ ఆటగాడు బాబర్ అజం ను పెవీలియన్ దారి పట్టించాడు.

స్పిన్ బౌలింగ్ ఆడటంలో మొనగాడిగా పేరున్న బాబర్ అజం..బ్యాట్-ప్యాడ్ మధ్యనున్న ఖాళీలో నుంచి కుల్దీప్ సంధించిన ఆఫ్ బ్రేక్.. కుబుసం విడిచిన మిన్నాగులా దూసుకుపోయింది.

గంటకు 72 కిలోమీటర్ల వేగంతో కుల్దీప్ సంధించిన ఈ బాల్…గాల్లోనుంచి వికెట్ మీదకు పడటమే కాదు..5.80 డిగ్రీల కోణంలో మెలికలు తిరిగి మరీ.. బాబర్ వికెట్ ను పడగొట్టింది. కుల్దీప్ విసిరిన ఈ బంతే మ్యాచ్ ను మలుపు తిప్పింది.

లెగ్ స్పిన్నర్ వార్న్ వేసిన లెగ్ బ్రేక్, లెప్టామ్ స్పిన్నర్ కుల్దీప్ విసిరిన ఆఫ్ బ్రేక్ …రెండూ…బ్యాట్స్ మన్ ఆఫ్ స్టంప్ ను పడగొట్టడం, అదీ మాంచెస్టర్ లోని ఓల్డ్ ట్రాఫర్డ్ స్టేడియం పిచ్ పైనే కావటం..ఓ అరుదైన ఘట్టంగా మిగిలిపోతుంది.

Tags:    
Advertisement

Similar News