మోడీ, మంత్రుల విమాన ఖర్చులు... ఇంత భారీ తేడానా?
మోడీ దేశంలో తక్కువ…. విదేశాల్లో ఎక్కువ గడిపారని…. విదేశీ పర్యటనల పేరిట ప్రపంచాన్ని ప్రభుత్వ ఖర్చుతో చుట్టివచ్చారనే విమర్శ ఉంది. అయితే తాజాగా మోడీతోపాటు.. ఆయన కేబినెట్ మంత్రులు కూడా ఎన్నిసార్లు విదేశీ యాత్రలకు వెళ్లారు.. వారి ఖర్చు ఎంత.? విమాన ప్రయాణాల్లో ఎంత ఖర్చు పెట్టారనే దానిపై సమాచార హక్కు చట్టం ద్వారా ఓ సామాజిక కార్యకర్త కోరగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ముంబైకి చెందిన సామాజిక కార్యకర్త ఈ విషయాలను బయటపెట్టడం సంచలనంగా […]
మోడీ దేశంలో తక్కువ…. విదేశాల్లో ఎక్కువ గడిపారని…. విదేశీ పర్యటనల పేరిట ప్రపంచాన్ని ప్రభుత్వ ఖర్చుతో చుట్టివచ్చారనే విమర్శ ఉంది.
అయితే తాజాగా మోడీతోపాటు.. ఆయన కేబినెట్ మంత్రులు కూడా ఎన్నిసార్లు విదేశీ యాత్రలకు వెళ్లారు.. వారి ఖర్చు ఎంత.? విమాన ప్రయాణాల్లో ఎంత ఖర్చు పెట్టారనే దానిపై సమాచార హక్కు చట్టం ద్వారా ఓ సామాజిక కార్యకర్త కోరగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ముంబైకి చెందిన సామాజిక కార్యకర్త ఈ విషయాలను బయటపెట్టడం సంచలనంగా మారింది.
2014 నుంచి డిసెంబర్ వరకు మొత్తం 5 ఆర్థిక సంవత్సరాల్లో ప్రధాని మోడీతోపాటు ఆయన మంత్రివర్గం మొత్తం ఐదేళ్లలో విదేశీ పర్యటనలకు ఎంత ఖర్చు పెట్టారనే విషయం వెలుగులోకి వచ్చింది. మోడీతోపాటు ఆయన కేబినెట్ మంత్రుల పర్యటనలకు మొత్తం 393 కోట్ల రూపాయలు ఖర్చు అయినట్లు పేర్కొన్నారు. ప్రధాన మంత్రి విదేశీ ప్రయాణాలకు సంబంధించి డిఫెన్స్ మినిస్ట్రీ నుంచి ఖర్చు పెడతారని…. కేబినెట్ మంత్రులకు ప్రయాణ వ్యయాల నుంచి నిధులు కేటాయిస్తారని తెలిపారు.
గతంలో రాజ్యసభలో వచ్చిన చర్చ సందర్భంగా మోడీ, మంత్రుల ప్రయాణాల ఖర్చు రూ.2,021 కోట్లుగా ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పుడు కేవలం 393 కోట్లు మాత్రమే లెక్కలు చెప్పడం గమనార్హం.