ఒక్క నెలలోనే 1100 మంది కీలక నేతలు టీడీపీ నుంచి వైసీపీలోకి జంప్
ఎన్నికల సమయం అంటేనే పార్టీల నుంచి వలసలు ఉంటాయి. టికెట్ రాలేదనే అసంతృప్తో.. అధికారం కోల్పోతామనే భయమో చాలా మంది గెలవబోయే పార్టీల్లోకి మారిపోతుంటారు. రాత్రికి రాత్రే కండువాలు మార్చే నేతల్లో తెలుగువారిదే పైచేయి. గత ఐదేళ్లుగా వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలు టీడీపీలోకి జంప్ అయ్యారు. కాగా, గత నెల రోజుల్లో 1100 మంది టీడీపీ నుంచి వైసీపీలో చేరడం ఆశ్చర్యం కలిగించే విషయం. వీరంతా అసెంబ్లీ, జిల్లా, రాష్ట్రస్థాయి నేతలే. అయితే వీరిలో అత్యధిక మంది […]
ఎన్నికల సమయం అంటేనే పార్టీల నుంచి వలసలు ఉంటాయి. టికెట్ రాలేదనే అసంతృప్తో.. అధికారం కోల్పోతామనే భయమో చాలా మంది గెలవబోయే పార్టీల్లోకి మారిపోతుంటారు. రాత్రికి రాత్రే కండువాలు మార్చే నేతల్లో తెలుగువారిదే పైచేయి. గత ఐదేళ్లుగా వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలు టీడీపీలోకి జంప్ అయ్యారు.
కాగా, గత నెల రోజుల్లో 1100 మంది టీడీపీ నుంచి వైసీపీలో చేరడం ఆశ్చర్యం కలిగించే విషయం. వీరంతా అసెంబ్లీ, జిల్లా, రాష్ట్రస్థాయి నేతలే. అయితే వీరిలో అత్యధిక మంది అధికార టీడీపీకి గుడ్‌బై చెప్పి జగన్ పార్టీలోకి రావడం గమనార్హం.
ఈ నేతలు వైసీపీలోకి మారిపోవడానికి ముఖ్య కారణం జగన్ చేసిన ప్రజా సంకల్ప యాత్రే. దీంతో పాటు వైసీపీ-ఐ పాక్ సంస్థ కలిసి చేస్తున్న క్యాంపెయిన్లు కూడా తోడ్పడ్డాయి. ముఖ్యంగా నిన్ను నమ్మం బాబు, జగన్ అన్న పిలుపు, సమర శంఖారావం వంటి నినాదాలు టీడీపీ నేతలను వైసీపీలోనికి ఆకర్షించడానికి ఉపయోగపడ్డాయి.
వైసీపీలోనికి ఇంత పెద్ద ఎత్తున వలస రావడానికి ఏపీ ప్రజల నాడిని సూచిస్తుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. టీడీపీలో పెద్ద నేతలైన అవంతి శ్రీనివాస్, పి. రవీంద్రబాబు…తో పాటు ఆ పార్టీ వ్యవస్థాపక సభ్యులైన దాసరి జైరమేష్, దగ్గుబాటి వెంకటేశ్వర్ల రాకతో వైసీపీకి కొత్త బలమొచ్చింది.
ఇక సిట్టింగ్ ఎమ్మెల్యేలైన పి. నారాయణ మూర్తి, మేడా మల్లిఖార్జున రెడ్డి, ఆమంచి కృష్ణమోహన్, వి.సుబ్బారావు, ఎస్వీ మోహన్ రెడ్డి, మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్ రెడ్డితో పాటు దాడి వీరభద్రరావు, కాండ్రు కమల, మాగుంట శ్రీనివాసులు రెడ్డి కూడా వైసీపీలో చేరారు.
గత వారం వైసీపీ తమ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల జాబితా ప్రకటించిన తర్వాత కూడా ఆ పార్టీలోకి వలసలు ఆగలేదంటే రాబోయే ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో అర్థమవుతోంది.
గత వారం రోజుల్లో 69 మంది అసెంబ్లీ స్థాయి, 310 మంది మండల స్థాయి, 752 మంది గ్రామస్థాయి నాయకులు వైసీపీలో చేరారు. నామినేషన్ల పర్వం మొదలయ్యాక కూడా వైసీపీలోనికి నాయకులు చేరుతుంటే.. మరో వైపు టీడీపీలో బీఫామ్‌లు ఇచ్చాక కూడా పార్టీ ఫిరాయించే ఘటనలు చోటు చేసుకుంటున్నాయి.
ఈ దఫా ఎన్నికల్లో వైసీపీ జెండా ఎగురవేయడం ఖాయమని పలు సర్వేలు చెబుతుండటంతో పాటు ప్రజలు కూడా ఒక సారి జగన్‌కు ఛాన్స్ ఇచ్చి చూద్దామని భావిస్తున్నట్లు రాజకీయ నాయకులు చెప్పుకుంటున్నారు.