జనసేనలో ఫ్యామిలీ ప్యాకేజీ పాలిటిక్స్!
జనసేన అధినేత పవన్ కల్యాణ్ తమ పార్టీకి కుల, మతాలు లేవు అంటారు. వారసత్వానికి ప్రాధాన్యత లేదంటారు. కుటుంబాల వారీగా టికెట్లు కేటాయించ వద్దని చెబుతారు. కానీ ఆచరణలో మాత్రం అవేవి ఆ పార్టీలో కన్పించడం లేదు. పవన్ కల్యాణ్ తాజాగా రెండు చోట్ల పోటీ చేస్తానని ప్రకటించారు. ఒకటి భీమవరం. రెండోది గాజువాక.. ఇక్కడ 2009లో ప్రజారాజ్యం తరపున చింతలపూడి వెంకట్రామయ్య పోటీ చేశారు. ఈయన నాగబాబు తోడల్లుడు. ఇప్పుడు ఈయనే పెందుర్తి నుంచి జనసేన […]
జనసేన అధినేత పవన్ కల్యాణ్ తమ పార్టీకి కుల, మతాలు లేవు అంటారు. వారసత్వానికి ప్రాధాన్యత లేదంటారు. కుటుంబాల వారీగా టికెట్లు కేటాయించ వద్దని చెబుతారు. కానీ ఆచరణలో మాత్రం అవేవి ఆ పార్టీలో కన్పించడం లేదు.
పవన్ కల్యాణ్ తాజాగా రెండు చోట్ల పోటీ చేస్తానని ప్రకటించారు. ఒకటి భీమవరం. రెండోది గాజువాక.. ఇక్కడ 2009లో ప్రజారాజ్యం తరపున చింతలపూడి వెంకట్రామయ్య పోటీ చేశారు. ఈయన నాగబాబు తోడల్లుడు. ఇప్పుడు ఈయనే పెందుర్తి నుంచి జనసేన అభ్యర్థిగా బరిలో ఉన్నారు.
మరోవైపు భీమవరంలో టీడీపీ తరపున పోటీ చేసే క్యాండేట్ పులపర్తి అంజిబాబు. ఈయన మంత్రి గంటా శ్రీనివాస్ వియ్యంకుడు. ఇక్కడ కూడా పవన్‌తో అండర్‌స్టాండింగ్ ఉండే అవకాశం ఉంది. పవన్ కల్యాణ్ కోసం గంటా, ఆయన వియ్యంకుడు తగ్గే అవకాశం ఉంది. కుదిరితే గాజువాక లేదా భీమవరంలో పవన్ గెలుపుకోసం టీడీపీ రాజీ పడే అవకాశాలు కన్పిస్తున్నాయి.
ఇటు జనసేనలో చేరిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ విశాఖ ఎంపీగా పోటీ చేయబోతున్నారు. అయితే ఆయన తోడల్లుడు రాజగోపాల్ ను అనంతపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయించాలని అనుకున్నారు. కానీ టీడీపీతో ఈక్వేషన్స్ కుదరలేదు. అనంతపురం ఎంపీ అభ్యర్థిగా బీసీని వైసీపీ నిలబెట్టింది, దీంతో రాజగోపాల్‌ను ఎంపీ క్యాండేట్ గా నిలబెట్టాలని ప్రయత్నాలు చేశారు. అయితే అదీ కుదరలేదు. దీంతో ఇప్పుడు ఆయనికి పార్టీలో పదవి ఇచ్చారు. జేడీ బంధువుకు పార్టీలో పెద్దపీట వేయడం ఇప్పుడు బంధుప్రీతి కాదా? అనే విషయం చర్చనీయాంశంగా మారింది.