ఫ్యానుకు అభ్యర్థుల గాలి... సైకిల్‌కు పోటీదారుల పంక్చర్

ఆంధ్రప్రదేశ్ శాసనసభలో విజయం దాదాపు ఖరారైపోయింది. అధికార తెలుగుదేశం పార్టీ చేసిన సర్వేలో కానీ, ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న సర్వేలో కాని, ఇంటెలిజెన్స్ విభాగం అధికారికంగా నిర్వహించిన సర్వే కానీ, జాతీయ మీడియా నిర్వహించిన రహస్య సర్వేలో కానీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభలో అత్యధిక స్థానాలు గెలుచుకుని అధికారంలోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ విషయాన్ని ముందుగానే తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లోక్ […]

Advertisement
Update:2019-03-05 03:56 IST

ఆంధ్రప్రదేశ్ శాసనసభలో విజయం దాదాపు ఖరారైపోయింది. అధికార తెలుగుదేశం పార్టీ చేసిన సర్వేలో కానీ, ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న సర్వేలో కాని, ఇంటెలిజెన్స్ విభాగం అధికారికంగా నిర్వహించిన సర్వే కానీ, జాతీయ మీడియా నిర్వహించిన రహస్య సర్వేలో కానీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభలో అత్యధిక స్థానాలు గెలుచుకుని అధికారంలోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ విషయాన్ని ముందుగానే తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లోక్ సభ ఎన్నికలలో తన పార్టీ వీలైనన్ని ఎక్కువ స్థానాలు గెలుచుకోవాలని వ్యూహరచన చేస్తున్నారు.

అయితే ఆయన వ్యూహాలకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలే పరిస్థితి కనిపిస్తోంది. 25 లోక్‌సభ స్థానాల నుంచి పోటీ చేసేందుకు తెలుగుదేశం పార్టీకి అభ్యర్థులే లేకుండా పోతున్నారు. సిట్టింగ్ ఎంపీలలో నలుగురైదుగురు ఈసారి పోటీ చేసేది లేదంటూ ఖరాకండిగా చంద్రబాబు చెప్పేశారు. వారితో పాటు మిగిలిన లోక్‌సభ స్థానాల్లో గెలుపు గుర్రాలను ఎంపిక చేయడం మాట అటుంచి అసలు అభ్యర్థులే దొరకని పరిస్థితి తెలుగుదేశం పార్టీకి ఎదురవుతోంది. సీనియర్ శాసనసభ్యులు కొందరిని లోక్‌సభ ఎన్నికల బరిలో దింపాలని బాబు భావిస్తున్నా వారి నుంచి మాత్రం సానుకూల సంకేతాలు రావడం లేదంటున్నారు.

ఇక ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మరో విధంగా ఉంది. ఏపీలోని 25 లోక్‌సభ నియోజకవర్గాలకుగాను దాదాపు 60 మంది అభ్యర్థులు వైసీపీ టికెట్ కోసం తమ ప్రయత్నాలు తీవ్రతరం చేశారు. రోజురోజుకు కొత్తగా పార్టీలో చేరుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. పార్టీలో చేరడానికి ముందు వారంతా ఒక అజెండాతో వస్తున్నారు.. కానీ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌తో సమావేశం అనంతరం వారి అభిప్రాయాలను మార్చుకుంటున్నారు. బయట మీడియాకు కూడా అధినేత చెప్పినట్లుగానే చేస్తాం అంటూ ప్రకటిస్తున్నారు.

ఇది జగన్మోహన్‌రెడ్డిలో కనిపిస్తున్న రాజకీయ పరిణితి గా విశ్లేషకులు చెబుతున్నారు. వైసీపీ తరపున అసెంబ్లీకి అయినా, లోక్‌సభకు అయినా పోటీ చేయడానికి తాము సిద్ధమేనని పార్టీ నాయకులు ఉత్సాహం చూపిస్తున్నారు. ఈ పరిణామాలతో లోక్‌సభ స్థానాలను ఎక్కువగా గెలుచుకుని చక్రం తిప్పాలనుకున్న బాబు పార్టీకి అభ్యర్థులు లేక సైకిల్‌కి పంక్చర్ పడుతుందేమోననే ఆందోళన రోజురోజుకు ఎక్కువవుతోందని సమాచారం.

Tags:    
Advertisement

Similar News