స్మార్ట్ క్యాప్సూల్.... దీర్ఘకాలపు వ్యాధులకు చెక్!

ఔషద ఉత్పత్తుల రంగంలోనూ టెక్నాలజీ ఎంతో ఉపయోగపడుతోంది. ఇందులో భాగంగానే స్మార్ట్ గుళికను అభివృద్ధి చేశారు శాస్త్రవేత్తలు. బ్లూటూత్ సాయంతో దీన్ని నియంత్రించేందుకు వీలుంటుంది. శరీరంలోకి ఔషధాలను చేరవేడయానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. అంతేకాదు శరీరం లోపలి స్థితిగతులపై స్మార్ట్ ఫోన్ ద్వారా ఇది సమాచారం అందిస్తుంది. Y ఆకారంలో ఉండే ఈ గుళికలు…నోటిలో వేసుకున్నప్పుడు ముడుచుకుపోతోంది. కడుపులోకి వెళ్లిన తర్వాత….Y ఆకారంలోకి మారుతుంది. స్మార్ట్ ఫోన్ నుంచి వచ్చే ఆదేశాలకు ఈ క్యాప్సుల్ స్పందిస్తుంది. దాదాపు నెల […]

Advertisement
Update:2018-12-16 07:40 IST

ఔషద ఉత్పత్తుల రంగంలోనూ టెక్నాలజీ ఎంతో ఉపయోగపడుతోంది. ఇందులో భాగంగానే స్మార్ట్ గుళికను అభివృద్ధి చేశారు శాస్త్రవేత్తలు. బ్లూటూత్ సాయంతో దీన్ని నియంత్రించేందుకు వీలుంటుంది.

శరీరంలోకి ఔషధాలను చేరవేడయానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. అంతేకాదు శరీరం లోపలి స్థితిగతులపై స్మార్ట్ ఫోన్ ద్వారా ఇది సమాచారం అందిస్తుంది.

Y ఆకారంలో ఉండే ఈ గుళికలు…నోటిలో వేసుకున్నప్పుడు ముడుచుకుపోతోంది. కడుపులోకి వెళ్లిన తర్వాత….Y ఆకారంలోకి మారుతుంది. స్మార్ట్ ఫోన్ నుంచి వచ్చే ఆదేశాలకు ఈ క్యాప్సుల్ స్పందిస్తుంది.

దాదాపు నెల రోజుల తర్వాత విచ్చిన్న మవుతుంది. జీర్ణాశయ వ్యవస్థ ద్వారా బయటకు వస్తుంది. 3D ముద్రాణా టెక్నాలజీతో అమెరికాలోని మసాచుసెట్స్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నిపుణులు ఈ గుళికలను తయారు చేశారు.

దీర్ఘకాలం పాటు మందులు అవసరమయ్యే వ్యాధులకు ఈ చికిత్స ఎంతగానో ఉపయోపడనుంది. ఇన్ఫెక్షన్లు, అలర్జీలతోపాటు ఔషధాల స్పందనలను గుర్తించగలదు. ఇతర వైద్య పరికరాలు, ఇంప్లాంట్లతోనూ అనుసంధానం అవుతుంది.

Tags:    
Advertisement

Similar News