ఇస్తే తీసుకోడు.... ఇవ్వకపోతే గోల చేస్తాడు
మనది పేద రాష్ట్రం అని, లోటు బడ్జెట్ అని… కట్టుబట్టలతో బయటకు పంపించారని…. నాలుగున్నరేళ్ళ నుంచి అరిగిపోయిన రికార్డు వేస్తున్న చంద్రబాబు…. కేంద్రం నిధులు ఇవ్వడం లేదని అరచి గోల పెడతాడు. కేంద్రం ఇచ్చిన నిధులను వాడుకోడు. అనేక స్కీమ్‌ల కింద ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం కేటాయించిన నిధులను కొన్నింటిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాడుకోకపోవడం వల్ల వృధా అవుతున్నాయి. కొన్ని పథకాల కింద తీసుకున్న నిధులకు లెక్కలు చెప్పరు (యుటిలైజేషన్ సర్టిఫికేట్లు సమర్పించరు). కొన్ని నిధులు అసలు తీసుకోనే […]
మనది పేద రాష్ట్రం అని, లోటు బడ్జెట్ అని… కట్టుబట్టలతో బయటకు పంపించారని…. నాలుగున్నరేళ్ళ నుంచి అరిగిపోయిన రికార్డు వేస్తున్న చంద్రబాబు…. కేంద్రం నిధులు ఇవ్వడం లేదని అరచి గోల పెడతాడు. కేంద్రం ఇచ్చిన నిధులను వాడుకోడు.
అనేక స్కీమ్‌ల కింద ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం కేటాయించిన నిధులను కొన్నింటిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాడుకోకపోవడం వల్ల వృధా అవుతున్నాయి. కొన్ని పథకాల కింద తీసుకున్న నిధులకు లెక్కలు చెప్పరు (యుటిలైజేషన్ సర్టిఫికేట్లు సమర్పించరు). కొన్ని నిధులు అసలు తీసుకోనే తీసుకోరు. ఉదాహరణకు ప్రధానమంత్రి ఆవాస్ యోజనా పథకం కింద వచ్చే నిధులను రాష్ట్ర ప్రభుత్వం సరిగ్గా సద్వినియోగం చేసుకోలేక పోయింది.
నాలుగున్నరేళ్ళ నుంచి పోలవరాన్ని, అమరావతిని గ్రాఫిక్స్‌లో చూపించడంలో మునిగిపోయి పేదలకు గృహ నిర్మాణాన్ని ప్రభుత్వం మర్చిపోయింది. నిజానికి ఆంధ్రప్రదేశ్‌లో సుమారు 14 లక్షల ఇళ్ళు కట్టించి ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వాన్ని ఏపీ ప్రభుత్వం నిధులకోసం కోరింది.
అయితే కేంద్రం ప్రధానమంత్రి ఆవాస్ యోజనా పథకం కింద ఇప్పటివరకు సుమారు 10 లక్షల ఇళ్ళ నిర్మాణానికి అంగీకారం తెలిపి… సుమారు 15 వేల కోట్ల రూపాయలు ఇవ్వడానికి ఆమోదం తెలిపింది. అయితే రాష్ట్రప్రభుత్వం ఈ నాలుగున్నరేళ్ళలో ఒక లక్షా తొమ్మిది వేల ఇళ్ళు మాత్రమే పూర్తి చేయగలిగింది. మరికొన్ని గృహాల నిర్మాణానికి ఈ చివరి దశలో హడావిడి పడుతోంది. ఇక ఎన్నికలకు నాలుగు నెలల సమయం మాత్రమే ఉండగా ఇక ఎన్ని ఇళ్ళు పూర్తి చేస్తారో తెలియదు.
ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల పేదలకు ఒక గూడు ఏర్పరుచుకునే అవకాశం తప్పిపోయింది. అందుకు ప్రభుత్వం సిగ్గుపడాల్సింది పోయి కట్టిన ఇళ్ళను, కడుతున్న ఇళ్ళను చూపిస్తూ, గృహ నిర్మాణంలో తమ ప్రభుత్వ గొప్పదనానికి తామే జబ్బలు చరుచుకుంటూ ఈ ఎన్నికల వేళ టీవీల్లో, పత్రికల్లో ప్రకటనల రూపంలో ఊదరగొడుతోంది. ప్రచారం మీద ఉన్న ఈ యావ గృహనిర్మాణం మీద చూపి ఉంటే మరికొన్ని లక్షల కుటుంబాలకు కాస్త నీడదొరికి ఉండేది.