నిలిచిపోనున్న గూగుల్ ప్లస్ సేవలు... ఖాతాల డేటా లీకే కారణమా?

డేటా లీక్… సోషల్ మీడియాకు తలనొప్పిగా మారింది. ఖాతాదారుల సమాచారం ఇతరులకు చేరిపోతోంది. ఫేస్‌బుక్ ఇప్పటికే ఇలాంటి ఇబ్బందులను ఎదుర్కొంది. అంతేకాదు ఎన్నో విమర్శలను సైతం ఎదుర్కోవాల్సి వచ్చింది. తాజాగా ప్రముఖ సెర్చింజన్ గూగుల్ కు చెందిన సామాజిక మాధ్యమం గూగుల్ ప్లస్ కు ఈ సమస్య ఎదురైంది. దీంతో సేవలను నిలివేయనుంది గూగుల్. 2019 ఏప్రిల్ నుంచి గూగుల్ ప్లస్ యూజర్లకు అందుబాటులో ఉండదు. గూగుల్ ప్లస్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ APIలో బగ్స్ ఉన్నందున 52.5 […]

Advertisement
Update:2018-12-13 06:40 IST

డేటా లీక్… సోషల్ మీడియాకు తలనొప్పిగా మారింది. ఖాతాదారుల సమాచారం ఇతరులకు చేరిపోతోంది. ఫేస్‌బుక్ ఇప్పటికే ఇలాంటి ఇబ్బందులను ఎదుర్కొంది. అంతేకాదు ఎన్నో విమర్శలను సైతం ఎదుర్కోవాల్సి వచ్చింది.

తాజాగా ప్రముఖ సెర్చింజన్ గూగుల్ కు చెందిన సామాజిక మాధ్యమం గూగుల్ ప్లస్ కు ఈ సమస్య ఎదురైంది. దీంతో సేవలను నిలివేయనుంది గూగుల్. 2019 ఏప్రిల్ నుంచి గూగుల్ ప్లస్ యూజర్లకు అందుబాటులో ఉండదు. గూగుల్ ప్లస్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ APIలో బగ్స్ ఉన్నందున 52.5 మిలియన్ల గూగుల్ ప్లస్ యూజర్ల సమాచారం చోరీకి గురైందని గూగుల్ గుర్తించింది.

గూగుల్ ప్లస్ యూజర్లకు చెందిన పేర్లు, ఈ-మెయిల్ అడ్రస్‌లు, వృత్తి, వయస్సు లాంటి వివరాలు ఇప్పటికే హ్యాకర్ల చేతుల్లోకి వెళ్లి ఉండవచ్చని భావిస్తున్నారు. ఇందులో భాగంగానే గూగుల్ తన గూగుల్ ప్లస్ యూజర్లకు ఈ విషయంపై నోటిఫికేషన్లను కూడా పంపుతున్నది.

అయితే సాఫ్ట్‌వేర్‌లో ఉన్న లోపం వల్లే ఇలా జరిగిందని గూగుల్ గుర్తించింది. మరో 90 రోజుల్లో మొత్తం గూగుల్ ప్లస్ APIలను గూగుల్ నిలిపివేయనుంది. దీంతో ఏప్రిల్ 2019 నుంచి గూగుల్ ప్లస్ సేవలను పూర్తిగా గూగుల్ నిలిపివేయనుంది.

Tags:    
Advertisement

Similar News