లక్ష్మినారాయణ పార్టీ పేరు అదేనట..!

రాజకీయాల్లోకి రావడానికి అంటూ కొంత కాలం కిందట సర్వీస్ నుంచి రిలీవ్ పొందిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ ఇప్పుడు సొంత పార్టీపెడతానని అంటున్నాడు. ముందుగా ఈయన ఏదైనా రాజకీయ పార్టీలోకి చేరతాడని అంతా అనుకున్నారు. ఈయనకు వివిధ పార్టీలు వెల్కమ్ చెప్పాయి కూడా. అటు తెలుగుదేశం పార్టీ, ఇటు బీజేపీ మరోవైపు జనసేన కూడా లక్ష్మినారాయణను చేర్చుకోవడానికి ఉత్సాహాన్ని చూపించాయి. ఈయన జగన్ పై నమోదైన కేసులను విచారించాడు. దాంతో ఫేమస్ అయ్యాడు. తెలుగుదేశం వాళ్లు […]

Advertisement
Update:2018-11-24 05:00 IST

రాజకీయాల్లోకి రావడానికి అంటూ కొంత కాలం కిందట సర్వీస్ నుంచి రిలీవ్ పొందిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ ఇప్పుడు సొంత పార్టీపెడతానని అంటున్నాడు. ముందుగా ఈయన ఏదైనా రాజకీయ పార్టీలోకి చేరతాడని అంతా అనుకున్నారు. ఈయనకు వివిధ పార్టీలు వెల్కమ్ చెప్పాయి కూడా.

అటు తెలుగుదేశం పార్టీ, ఇటు బీజేపీ మరోవైపు జనసేన కూడా లక్ష్మినారాయణను చేర్చుకోవడానికి ఉత్సాహాన్ని చూపించాయి.

ఈయన జగన్ పై నమోదైన కేసులను విచారించాడు. దాంతో ఫేమస్ అయ్యాడు. తెలుగుదేశం వాళ్లు ఈయనను హీరోని చేశారు. ఇలాంటి నేపథ్యంలో ఈయనను చేర్చుకోవడానికి ఆ పార్టీలు ఉత్సాహాన్ని చూపించాయి.

అయితే.. లక్ష్మినారాయణ మాత్రం వాళ్ళతో టర్మ్స్‌ కుదిరినట్టు లేదు. తను సొంత పార్టీ పెట్టుకుంటానని అంటున్నాడు. అందులో భాగంగా ఈయన పార్టీ పేరు కూడా ఇప్పుడు ప్రచారానికి వస్తోంది. ఆ పార్టీ పేరు జనధ్వని అట. ఈ పేరుతో లక్ష్మినారాయణ రాజకీయం చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

జనధ్వని అనే పేరును షార్ట్ గా జేడీ అని పలకవచ్చు అని.. ఎలాగూ లక్ష్మినారాయణ గతంలో సీబీఐకి జేడీగా పని చేశాడు కాబట్టి… ఈ పేరు కలిసి వస్తుందని అనుకుంటున్నాడని సమాచారం. జేడీగా ఫేమస్ అయ్యాడు కాబట్టి.. జేడీ అనే పార్టీతో ఈయన రాజకీయం చేస్తాడట.

Tags:    
Advertisement

Similar News