గుత్తా నిజంగానే ఐరన్ లెగ్గా?
కాంగ్రెస్ నుంచి ఇటీవల టీఆర్ ఎస్‌లో చేరిన నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి గురించి ఓ ఆసక్తికర కామెంట్ చేశాడు మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఆయన పెద్ద ఐరన్ లెగ్గని, ఆయన ఏ పార్టీలో చేరితే.. ఆ పార్టీ నాశనమవుతుందని ఆరోపించాడు. అస్సలు గుత్తాని చేర్చుకుని సీఎం కేసీఆర్ పెద్ద తప్పు చేశాడని తేల్చేశాడు. గుత్తా సుఖేందర్‌కు నిజంగా దమ్ముంటే.. నల్లగొండ రాజ్యసభ స్థానానికి రాజీనామా చేసి తిరిగి కారు గుర్తుపై పోటీచేసి గెలవాలని […]
Advertisement
కాంగ్రెస్ నుంచి ఇటీవల టీఆర్ ఎస్‌లో చేరిన నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి గురించి ఓ ఆసక్తికర కామెంట్ చేశాడు మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఆయన పెద్ద ఐరన్ లెగ్గని, ఆయన ఏ పార్టీలో చేరితే.. ఆ పార్టీ నాశనమవుతుందని ఆరోపించాడు. అస్సలు గుత్తాని చేర్చుకుని సీఎం కేసీఆర్ పెద్ద తప్పు చేశాడని తేల్చేశాడు. గుత్తా సుఖేందర్‌కు నిజంగా దమ్ముంటే.. నల్లగొండ రాజ్యసభ స్థానానికి రాజీనామా చేసి తిరిగి కారు గుర్తుపై పోటీచేసి గెలవాలని సవాలు విసిరారు.
గుత్తా పార్టీలు మారడంపై రకరకాల వాదనలు ఉన్నాయి. ఆయన ఏ పార్టీలో చేరినా.. కచ్చితంగా గెలుస్తారని కొందరు వాదిస్తే.. ఆయన ఎక్కడ ఉంటే అక్కడ పార్టీ నాశనమని మరికొందరు వాదిస్తుంటారు. ఆయన అవకాశవాది అని మునిగిపోయే నావలో నుంచి పక్క నావలోకి దూకడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య అని మరికొందరు అంటారు. ఆయన వదిలేసిన పార్టీకి కష్టాలు తప్పవని, అలాగని ఆయన చేరిన పార్టీకి కూడా తీవ్ర ఇబ్బందులు తప్పవని, అప్పుడే ఆయన లెగ్ పవర్ తెలిసివస్తుందని వాదించేవారూ ఉన్నారు.
గుత్తా రాజకీయ జీవితాన్నిఒక్కసారి పరిశీలిద్దాం..
1. జిల్లాలో 1999-2004 వరకు టీడీపీ తరఫున ఆయన ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. తరువాత కాంగ్రెస్ పార్టీలో చేరారు.
2. 2009లో నల్లగొండ నుంచి పార్లమెంటు సభ్యుడిగా రెండోసారి గెలుపొందారు. తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు.
3.తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తరువాత 2014 సార్వత్రిక ఎన్నికల్లో గుత్తా సుఖేందర్ నల్లగొండ నుంచి మూడోసారి ఎంపీగా గెలిచారు. రాష్ట్ర వ్యాప్తంగా కారు గాలి వీచినా.. ఆయన తట్టుకుని ఎన్నికల్లో నెగ్గగలిగారు.
4. ఇటీవల కాంగ్రెస్ నుంచి టీఆర్ ఎస్‌లో చేరారు.
Advertisement