ఆలయాల కూల్చివేతపై చిన్నజీయర్ మౌనం వెనుక...
ఏపీలో పలు ఆలయాలను ధ్వంసం చేస్తోంటే.. మిత్రపక్షం కాషాయదళమైన బీజేపీలో ఎలాంటి స్పందన లేకపోవడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. హిందూ అజెండా కలిగిన ఆర్ ఎస్ ఎస్… సంఘ్‌పరివార్ ల అనుబంధ పార్టీగా ప్రతిపక్షాలను విమర్శించే బీజేపీ ఈ విషయంలో ఇంతవరకూ ఎలాంటి నిరసనగానీ, అభ్యంతరం గానీ తెలియజేయకపోవడం తెలుగు రాష్ట్రాల ప్రజలను విస్మయానికి గురి చేస్తోంది.వీహెచ్ పీ లాంటి సంస్థల గళమే గల్లంతయ్యింది. గుర్తుకొచ్చినప్పుడల్లా.. రామజన్మభూమి, అయోధ్యలో రామాలయం అంటూ జనాలను గిచ్చి నిద్రలేపే బీజేపీ నేతలు […]
Advertisement
ఏపీలో పలు ఆలయాలను ధ్వంసం చేస్తోంటే.. మిత్రపక్షం కాషాయదళమైన బీజేపీలో ఎలాంటి స్పందన లేకపోవడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. హిందూ అజెండా కలిగిన ఆర్ ఎస్ ఎస్… సంఘ్‌పరివార్ ల అనుబంధ పార్టీగా ప్రతిపక్షాలను విమర్శించే బీజేపీ ఈ విషయంలో ఇంతవరకూ ఎలాంటి నిరసనగానీ, అభ్యంతరం గానీ తెలియజేయకపోవడం తెలుగు రాష్ట్రాల ప్రజలను విస్మయానికి గురి చేస్తోంది.వీహెచ్ పీ లాంటి సంస్థల గళమే గల్లంతయ్యింది. గుర్తుకొచ్చినప్పుడల్లా.. రామజన్మభూమి, అయోధ్యలో రామాలయం అంటూ జనాలను గిచ్చి నిద్రలేపే బీజేపీ నేతలు ఏపీలో 40 ఆలయాలను కూల్చివేస్తోంటే.. మౌనం వహించడం సర్వత్రా చర్చానీయాంశమైంది. పైగా మరో చోట గుళ్లు కట్టేందుకు స్థలం ఇస్తామని చంద్రబాబు చెప్పారంటూ బీజేపీ అధ్యక్షుడు హరిబాబు సెలవివ్వకడం ఇక్కడ ఆశ్చర్యంలోనే ఆశ్చర్యం. అలా ఒక కూల్చి మరొక చోట స్థలమిస్తే సరిపోతుందనుకుంటే అసలు అయోధ్య సమస్యే ఉండేదికాదు కదా!. దేవాలయాలను కూడా హరిబాబు ఒక సాధారణ కట్టడంగా చూడడం బీజేపీకి ఏమో గానీ హిందూమతానికి మాత్రం అవమానమే.
గతంలో బాబు సీఎంగా ఉన్నపుడు తిరుపతిలో మోకాళ్ల మంటపం జోలికి వెళ్లినపుడు పీఠాధిపతులు బాబును తీవ్రంగా శపించారు. కానీ, ఈసారి ఏకంగా 30 ఆలయాలను కూలుస్తున్నా.. స్వరూపనందేంద్ర సరస్వతి లాంటి ఒకరిద్దరు తప్పితే మిగిలిన వారెవ్వరూ ఎలాంటి ప్రకటన చేయకపోవడం విశేషం. విజయవాడలో చిన్నజీయర్ స్వామి మఠానికి కూతవేటు దూరంలోనే ఆలయాలను కూల్చివేతలు జరుగుతోంటే ఆయనెందుకు స్పందించడం లేదని మాజీ ఎంపీ వీహెచ్ ప్రశ్నించారు. వెయ్యికాళ్ల మండలం తిరిగి నిర్మించేవరకూ తిరుమల వెళ్లనని శపథం చేసిన చినజీయర్ ఇప్పుడు మాత్రం మౌనంగా ఉండడం ఆశ్చర్యమేనంటున్నారు. మొత్తం మీద చంద్రబాబు 40 ఆలయాలను కూల్చివేత ద్వారా హిందుత్వంపై అసలు భక్తి ఉన్న వారెవరో సమాజానికి తెలిసేలా చేశారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Advertisement