రేవంత్‌పై కేసు నమోదు... అనుచిత వ్యాఖ్యలు ఏం చేశారంటే...
టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్‌పై కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు. మల్లన్నసాగర్ నిర్వాహితుల పక్షాన దీక్ష చేస్తున్న రేవంత్ శనివారం కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేశారు. రైతులను నడిబజార్లో బిచ్చగాళ్లుగా మార్చేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. నష్టపరిహారం అడిగితే ఇదంతా ప్రాజెక్టు అడ్డుకునేందుకు ఆంధ్రావాళ్లు చేస్తున్న కుట్ర అంటూ ఎదురుదాడి చేస్తారా అంటూ మండిపడ్డారు. అంతటితో రేవంత్ ఆగలేదు. ఆంధ్రావాళ్లు కుట్ర చేస్తున్నారంటూనే అమరావతి వెళ్లి బిర్యానీ తినివచ్చిన గాడిద ఎవరు అంటూ […]
టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్‌పై కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు. మల్లన్నసాగర్ నిర్వాహితుల పక్షాన దీక్ష చేస్తున్న రేవంత్ శనివారం కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేశారు. రైతులను నడిబజార్లో బిచ్చగాళ్లుగా మార్చేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. నష్టపరిహారం అడిగితే ఇదంతా ప్రాజెక్టు అడ్డుకునేందుకు ఆంధ్రావాళ్లు చేస్తున్న కుట్ర అంటూ ఎదురుదాడి చేస్తారా అంటూ మండిపడ్డారు. అంతటితో రేవంత్ ఆగలేదు.
ఆంధ్రావాళ్లు కుట్ర చేస్తున్నారంటూనే అమరావతి వెళ్లి బిర్యానీ తినివచ్చిన గాడిద ఎవరు అంటూ కేసీఆర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. తెలంగాణలో ప్రాజెక్టుల కాంట్రాక్టులు ఆంధ్రావాళ్లకే అప్పగిస్తున్నారని రేవంత్ ఆరోపించారు. సాధారణంగా ఉద్యమాలు చేసిన కుటుంబాలు నష్టపోతుంటాయని… కానీ ఉద్యమం పేరుతో వేలకోట్లు దోచుకుంటున్న నాకొడుకు ఎవరైనా ఉన్నారంటే అది కేసీఆర్ మాత్రమేనని రేవంత్ అనుచితవ్యాఖ్యలు చేశారు. రేవంత్ ఈ రేంజ్లో వ్యాఖ్యలు చేయడాన్ని పలువురు తప్పుపడుతున్నారు. కేసీఆర్ అమరావతి వెళ్లి బిర్యాని తిని ఉండవచ్చని… ఆ తర్వాత కొద్దిరోజులకే చంద్రబాబు కూడా కేసీఆర్ నిర్వహించిన చండీయాగానికి వచ్చిన విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నారు. రేవంత్ చేసిన వ్యాఖ్యలపై జూబ్లిహిల్స్ పీఎస్‌లో కేసులు నమోదయ్యాయి. 504, 290, 188 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
Click on Image to Read: