కృష్ణా వైసీపీలో కలకలం.... వార్తలను ఖండించిన ఎమ్మెల్యే

కృష్ణా జిల్లా వైసీపీ నుంచి మరో ముగ్గురు ఎమ్మెల్యేలు టీడీపీలో చేరేందుకు చర్చలు జరుపుతున్నారంటూ టీడీపీ జిల్లా అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. ఆ ముగ్గురిలో నూజివీడు ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావు కూడా ఉన్నారంటూ ఆయన వెల్లడించారు. చర్చలు జరుగుతున్నాయి కానీ ఎమ్మెల్యేల డిమాండ్లకు తాము ఒప్పుకోవడం లేదని  టీడీపీ జిల్లా అధ్యక్షుడు చెప్పారు. బచ్చుల అర్జునుడు నేరుగా తన పేరు ప్రస్తావించడంతో నూజివీడు వైసీపీ ఎమ్మెల్యే మేకా అప్పారావు స్పందించారు. […]

Advertisement
Update:2016-06-23 09:07 IST

కృష్ణా జిల్లా వైసీపీ నుంచి మరో ముగ్గురు ఎమ్మెల్యేలు టీడీపీలో చేరేందుకు చర్చలు జరుపుతున్నారంటూ టీడీపీ జిల్లా అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. ఆ ముగ్గురిలో నూజివీడు ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావు కూడా ఉన్నారంటూ ఆయన వెల్లడించారు. చర్చలు జరుగుతున్నాయి కానీ ఎమ్మెల్యేల డిమాండ్లకు తాము ఒప్పుకోవడం లేదని టీడీపీ జిల్లా అధ్యక్షుడు చెప్పారు.

బచ్చుల అర్జునుడు నేరుగా తన పేరు ప్రస్తావించడంతో నూజివీడు వైసీపీ ఎమ్మెల్యే మేకా అప్పారావు స్పందించారు. తాను వైసీపీని వీడే ప్రసక్తే లేదన్నారు. ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీ మారుతారంటూ టీడీపీ నేతలు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికే పార్టీ వీడిన ఎమ్మెల్యేల పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకల్లా తయారైందన్నారు. పార్టీ మారిన వారు తాము ఎందుకు వైసీపీని వీడామా అని బాధపడుతున్నారని మేకా అప్పారావు చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వైసీపీని తాను గానీ, ఇతర ఎమ్మెల్యేలు గానీ వీడే అవకాశం లేదని ఆయన చెప్పారు.

Click on Image to Read:

 

 

 

Tags:    
Advertisement

Similar News