రీమేక్ లో కూడా రీమిక్స్ చేసి కొడతాడట.....
ఏమాత్రం ఆలస్యం చేయకుండా మరో సినిమా ప్రారంభించాడు పవన్. సర్దార్ గబ్బర్ సింగ్ ఫ్లాప్ అవ్వడంతో తన ఫ్రెండ్ అయిన నిర్మాత కోసం… లాస్ అయిన డిస్ట్రిబ్యూటర్ల కోసం వెంటనే మరో సినిమాకు కొబ్బరికాయ కొట్టాడు. ఇంతవరకు బాగానే ఉంది కానీ.. కథపై నెలల పాటు చర్చించే పవన్ ఇంత త్వరగా స్టోరీలైన్ కు ఎలా ఓకే చెప్పాడనేదే పెద్ద ప్రశ్నగా మిగిలిపోయింది. చాలా కథలు వినాలి… అందులో మార్పులు చేయాలి…. తన మార్కు చూపించాలి… అప్పుడు […]
Advertisement
ఏమాత్రం ఆలస్యం చేయకుండా మరో సినిమా ప్రారంభించాడు పవన్. సర్దార్ గబ్బర్ సింగ్ ఫ్లాప్ అవ్వడంతో తన ఫ్రెండ్ అయిన నిర్మాత కోసం… లాస్ అయిన డిస్ట్రిబ్యూటర్ల కోసం వెంటనే మరో సినిమాకు కొబ్బరికాయ కొట్టాడు. ఇంతవరకు బాగానే ఉంది కానీ.. కథపై నెలల పాటు చర్చించే పవన్ ఇంత త్వరగా స్టోరీలైన్ కు ఎలా ఓకే చెప్పాడనేదే పెద్ద ప్రశ్నగా మిగిలిపోయింది. చాలా కథలు వినాలి… అందులో మార్పులు చేయాలి…. తన మార్కు చూపించాలి… అప్పుడు మాత్రమే కొబ్బరికాయ కొట్టాలి. ఇది పవన్ స్టయిల్. కానీ ఎస్ జే సూర్య చెప్పిన కథకు మాత్రం ఏమాత్రం కొర్రీలు పెట్టకుండా పచ్చజెండా ఊపాడు. దీనికి కారణం ఎస్ జే సూర్య అనుసరించిన విధానం. తమిళ్ లో హిట్టయిన అజిత్ రెండు సినిమాల్ని మిక్స్ చేసి మరీ కథ చెప్పాడట దర్శకుడు. అజిత్ నటించిన వేలాయుధం, వీరమ్ అనే రెండు సినిమాల్ని మిక్స్ చేసి పవన్ కు వినిపించాడట. అప్పటికే ఆ రెండు సినిమాల్ని చూసిన అనుభవంతో పవన్ వెంటనే కథకు కనెక్ట్ అయ్యాడట. అలా 2-3 సిట్టింగ్స్ లోనే ప్రాజెక్టు ఓకే అయిపోయింది.
Click on Image to Read:
Advertisement