పేకాట క్లబ్బుల మూసివేత వెనక డిప్యూటీ స్పీకర్!
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించాక మహిళల సంక్షేమానికి షీక్యాబ్స్, షీ-టీమ్‌లతోపాటు పలు నిర్ణయాలను సీఎం కేసీఆర్ తీసుకున్నారు. ఇందులో పేకాట క్లబ్బుల మూసివేత కూడా ఒకటి. దీనికి వెనక ఉన్న ఆసక్తికరమైన కథను డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి ఖమ్మంలో జరుగుతున్న గులాబీప్లీనరీ సందర్భంగా వివరించారు. తెలంగాణలో పేకాట వల్ల పలు కాపురాలు కూలిపోయాయని, అందుకే వీటి వేయాల్సి వచ్చిందని తెలిపారు. అమెరికాలో ఉండే ఓ ఎన్ ఆర్ ఐ భర్త తెలంగాణలో ఉంటూ పేకాట వ్యసనానికి […]
Advertisement
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించాక మహిళల సంక్షేమానికి షీక్యాబ్స్, షీ-టీమ్‌లతోపాటు పలు నిర్ణయాలను సీఎం కేసీఆర్ తీసుకున్నారు. ఇందులో పేకాట క్లబ్బుల మూసివేత కూడా ఒకటి. దీనికి వెనక ఉన్న ఆసక్తికరమైన కథను డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి ఖమ్మంలో జరుగుతున్న గులాబీప్లీనరీ సందర్భంగా వివరించారు. తెలంగాణలో పేకాట వల్ల పలు కాపురాలు కూలిపోయాయని, అందుకే వీటి వేయాల్సి వచ్చిందని తెలిపారు. అమెరికాలో ఉండే ఓ ఎన్ ఆర్ ఐ భర్త తెలంగాణలో ఉంటూ పేకాట వ్యసనానికి బానిస అయ్యాడట. అతను అమెరికాలో ఉన్న భార్య వద్దకు వెళ్లకుండా.. నగరంలోనే ఉంటూ నిత్యం పేకాటలో మునిగి తేలేవాడు. దీంతో ఆ మహిళ తన దుస్థితిని డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి కి వివరించారు. దీనిపై స్పందించిన ఆమె ఈ విషయాన్ని వెంటనే సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై సీఎం కేసీఆర్ అప్పటికప్పుడు నిర్ణయం తీసుకున్నారని, ఆ నిర్ణయం ఫలితంగానే నేడు తెలంగాణలో పేకాట క్లబ్బులు మూతపడ్డాయని అసలు విషయాన్ని వెల్లడించారు పద్మా దేవేందర్ రెడ్డి. తరువాత చాలామంది పేకాట క్లబ్బుల యజమానులు వచ్చి సీఎంను కోరినా.. ఆయన వారందరినీ బహిరంగంగా హెచ్చరించిన విషయం మనందరికీ తెలిసిందే!
Advertisement