తలసాని స్థాయి పెరిగిందా?
ఇటీవల జరిగిన మంత్రి వర్గ శాఖల మార్పుపై వస్తున్న కథనాలపై సీఎం కేసీఆర్ స్పందించారు. ఖమ్మంలో జరిగిన టీఆర్ ఎస్ ప్లీనరీ సందర్భంగా సీఎం కేసీఆర్ ఈ విషయంపై వివరణ ఇచ్చుకున్నారు. తలసాని నుంచి వాణిజ్య శాఖను తప్పించడం వల్ల ఆయన స్థాయిని తగ్గించారనడం సరికాదన్నారు. తలసానికి బీసీ సంక్షేమ శాఖను అప్పగించి ఆయన స్థాయిని రెండింతలకు పెంచామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీల సమస్యలపై అవగాహన ఉన్న బీసీ నేతగా తలసాని నియామకాన్ని ఆయన […]
Advertisement
ఇటీవల జరిగిన మంత్రి వర్గ శాఖల మార్పుపై వస్తున్న కథనాలపై సీఎం కేసీఆర్ స్పందించారు. ఖమ్మంలో జరిగిన టీఆర్ ఎస్ ప్లీనరీ సందర్భంగా సీఎం కేసీఆర్ ఈ విషయంపై వివరణ ఇచ్చుకున్నారు. తలసాని నుంచి వాణిజ్య శాఖను తప్పించడం వల్ల ఆయన స్థాయిని తగ్గించారనడం సరికాదన్నారు. తలసానికి బీసీ సంక్షేమ శాఖను అప్పగించి ఆయన స్థాయిని రెండింతలకు పెంచామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీల సమస్యలపై అవగాహన ఉన్న బీసీ నేతగా తలసాని నియామకాన్ని ఆయన సమర్థించుకున్నారు. మీడియాలో జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని కుండబద్దలు కొట్టారు. వాణిజ్య శాఖ ఆదాయాన్ని మరింత పెంచేందుకు ఆ శాఖను తన వద్ద పెట్టుకున్నానని వివరణ ఇచ్చుకున్నారు.
మర్రిపై వ్యాఖ్యల సంగతేంటి?
తలసాని శాఖ మార్పుపై కాంగ్రెస్ నేత మర్రి శశిధర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలుచేసిన సంగతి తెలిసిందే! వాణిజ్య పన్నుల మంత్రిగా కొనసాగినంత కాలం తలసాని వ్యాపారుల వద్ద అక్రమ వసూళ్లకు పాల్పడ్డారని ఆరోపించారు. ఇప్పటికైనా ఒళ్లు దగ్గరపెట్టుకోవాలని హితవు పలికారు. మరోవైపు ఆయన కుటుంబ సభ్యులు పలు కేసుల్లో తలదూర్చడంపై కూడా ఇటీవలి కాలంలో చర్చానీయాంశంగా మారినసంగతి తెలిసిందే. ఆయన శాఖ మార్పుకు బహుశా ఇవే కారణమై ఉంటాయన్న కోణంలో మీడియాలో ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే! మొత్తానికి సీఎం కేసీఆర్ దీనిపై వివరణ ఇచ్చుకోవడంతో ఈ వివాదానికి ముగింపు పలికినట్లయింది.
Advertisement