రజనీతో అంచుల వరకు వెళ్లిందట

సూపర్ స్టార్ రజనీకాంత్ సరసన నటించాలని ఏ హీరోయిన్ అయినా కోరుకుంటుంది. కానీ ఆ అవకాశం అతికొద్ది మందికి మాత్రమే లభిస్తుంది. అలా ఛాన్స్ దక్కించుకున్న భామల్లో రాధికా ఆప్టే ఒకరు. కబాలి సినిమాతో రజనీ సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది రాధికా ఆప్టే. సినిమా షూటింగ్ కంప్లీట్ అయి… విడుదలకు సిద్ధమౌతున్న టైమ్ లో మీడియాకు ఇంటర్వ్యూ కూడా ఇచ్చింది. సూపర్ స్టార్ తో నటించడం ఓ గొప్ప వరం అని అంటున్న రాధిక… యాక్టింగ్ […]

Advertisement
Update:2016-04-27 06:12 IST

సూపర్ స్టార్ రజనీకాంత్ సరసన నటించాలని ఏ హీరోయిన్ అయినా కోరుకుంటుంది. కానీ ఆ అవకాశం అతికొద్ది మందికి మాత్రమే లభిస్తుంది. అలా ఛాన్స్ దక్కించుకున్న భామల్లో రాధికా ఆప్టే ఒకరు. కబాలి సినిమాతో రజనీ సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది రాధికా ఆప్టే. సినిమా షూటింగ్ కంప్లీట్ అయి… విడుదలకు సిద్ధమౌతున్న టైమ్ లో మీడియాకు ఇంటర్వ్యూ కూడా ఇచ్చింది. సూపర్ స్టార్ తో నటించడం ఓ గొప్ప వరం అని అంటున్న రాధిక… యాక్టింగ్ లో రజనీ తనను అంచుల వరకు తీసుకెళ్లాడని చెబుతోంది. నటనకు సంబంధించి నడిచే డిక్షనరీగా రజనీని చెప్పుకొచ్చింది. షూటింగ్ టైమ్‌లో తాను రజనీతో చాలా అద్భుతంగా గడిపినట్లు చెప్పింది. అది తన జీవితంలోనే అత్యుత్తమ అనుభవమని, అది చాలా స్ఫూర్తిదాయకంగా ఉందని తెలిపింది. ఆయన ఓ వండర్‌ఫుల్ మనిషని, ఆయనలా ఎవరూ ఉండనే ఉండరని రాధిక చెప్పింది. కబాలి సినిమాలో రజనీకాంత్ డాన్‌ పాత్ర పోషిస్తుండగా, రాధికా ఆప్టే అతడి భార్య పాత్ర పోషిస్తోంది. తమిళనాట ఎన్నికల ప్రక్రియ ముగిసిన వెంటనే సినిమా విడుదల తేదీని ప్రకటిస్తారు.

Tags:    
Advertisement

Similar News