తెలంగాణ...ఇది చాలా హీట్ గురూ!
ఎండల్లో మాడిపోవడం అంటే ఏమిటో ఇప్పుడు తెలుగురాష్ట్రాల్లో చాలా స్పష్టంగా కనబడుతోంది. చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాలతో పోలిస్తే తెలుగురాష్ట్రాల్లోనే ఎండల కారణంగా మరణించినవారి సంఖ్య ఎక్కువగా ఉంది. దేశం మొత్తంమీద ఈ ఏడాది ఇప్పటివరకు వడదెబ్బ మరణాలు 65 ఉంటే ఒక్క తెలంగాణలోనే ఆ సంఖ్య 35గా ఉంది. భారత వాతావరణశాఖ రానున్న కొద్ది రోజుల్లో ఎండలు మండిపోయే ఎనిమిది రాష్ట్రాలను ప్రకటించింది. అందులో తెలంగాణ సైతం ఉంది. ఇన్ని మాటలెందుకు కరీంనగర్‌లో ఒక మహిళ తనింట్లో […]
ఎండల్లో మాడిపోవడం అంటే ఏమిటో ఇప్పుడు తెలుగురాష్ట్రాల్లో చాలా స్పష్టంగా కనబడుతోంది. చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాలతో పోలిస్తే తెలుగురాష్ట్రాల్లోనే ఎండల కారణంగా మరణించినవారి సంఖ్య ఎక్కువగా ఉంది. దేశం మొత్తంమీద ఈ ఏడాది ఇప్పటివరకు వడదెబ్బ మరణాలు 65 ఉంటే ఒక్క తెలంగాణలోనే ఆ సంఖ్య 35గా ఉంది. భారత వాతావరణశాఖ రానున్న కొద్ది రోజుల్లో ఎండలు మండిపోయే ఎనిమిది రాష్ట్రాలను ప్రకటించింది. అందులో తెలంగాణ సైతం ఉంది. ఇన్ని మాటలెందుకు కరీంనగర్‌లో ఒక మహిళ తనింట్లో నేలమీదే ఆమ్లెట్ వేసేసింది. ఓ వీడియోలో ఆ విషయం స్పష్టంగా కనబడుతోంది. హైదరాబాద్, నిజామాబాద్, ఖమ్మం, రంగారెడ్డి. కరీంనగర్ జిల్లాల్లో ఎండలు మరింత ఎక్కువగా ఉంటాయని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఆయా జిల్లాల పాలనా యంత్రాంగాలను హెచ్చరించింది.