రేవంత్ తెలంగాణ లగడపాటా?
తెలంగాణ ఉద్యమకాలంలో కేసీఆర్ పేరు ఎంత ప్రముఖంగా వినిపించిందో.. అప్పటి విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ పేరు కూడా అంతే ప్రముఖంగా వినిపించింది. తెలంగాణ ఉద్యమాన్ని అడ్డుకోవడానికి ఆయన చేయని ప్రయత్నంలేదు. చివరికి పార్లమెంటులోనే పెప్పర్ స్ర్పే చల్లి సభలో ఎంపీలందరినీ పరుగులు పెట్టించారు. తెలంగాణ వస్తే రాజకీయ సన్యాసం చేస్తానని చెప్పి.. మరీ రాజకీయాల నుంచి తప్పుకున్నారు. పదే పదే.. తనకు తానుగా సొంతంగా సర్వేలు చేయించి ఫలితాలు వెల్లడించి వార్తల్లో పతాక శీర్షికలో నిలిచేవారు లగడపాటి.. […]
Advertisement
తెలంగాణ ఉద్యమకాలంలో కేసీఆర్ పేరు ఎంత ప్రముఖంగా వినిపించిందో.. అప్పటి విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ పేరు కూడా అంతే ప్రముఖంగా వినిపించింది. తెలంగాణ ఉద్యమాన్ని అడ్డుకోవడానికి ఆయన చేయని ప్రయత్నంలేదు. చివరికి పార్లమెంటులోనే పెప్పర్ స్ర్పే చల్లి సభలో ఎంపీలందరినీ పరుగులు పెట్టించారు. తెలంగాణ వస్తే రాజకీయ సన్యాసం చేస్తానని చెప్పి.. మరీ రాజకీయాల నుంచి తప్పుకున్నారు. పదే పదే.. తనకు తానుగా సొంతంగా సర్వేలు చేయించి ఫలితాలు వెల్లడించి వార్తల్లో పతాక శీర్షికలో నిలిచేవారు లగడపాటి.. అయితే, లగడపాటి రేంజిల్లో కాకున్నా.. తన వంతుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై సర్వే చేయించి.. లగడపాటిని గుర్తుకు తెస్తున్నారు టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి.
ఇటీవల ఆయన కూడా ఓ సర్వే చేయించారట. అందులో తెలంగాణ రాష్ట్ర సమితికి ఓటు బ్యాంకు 66 శాతం నుంచి 46 శాతానికి పడిపోయిందని తేలిందని చెప్పారు. ఈ సర్వే ఎప్పుడు ఎక్కడ ఎలా జరిగిందో అన్న వివరాలు మాత్రం వెల్లడించలేదు. ఈ సర్వే ద్వారా తెలంగాణ రాష్ట్ర సమితికే అనుకూలంగా మాట్లాడారు. అదెలా? అంటే.. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే.. తెలంగాణలో ఉన్న పార్టీలకు మిగిలిన 56 శాతం ఓట్లు పోయినా.. 46 శాతం టీఆర్ ఎస్‌కే వస్తాయి. కాబట్టి ఆ పార్టీకి వచ్చిన నష్టమేం లేదు. అయితే కాలం గడిచే కొద్దీ టీఆర్ఎస్ బలహీనపడుతోందని ఈ సర్వే ద్వారా తేలిందని పార్టీ శ్రేణులకు మేసేజ్ ఇవ్వదలుచుకున్నట్టుగా రేవంత్ ఉన్నారు. ఇప్పుడు ఈ రేవంత్‌ను టీఆర్ ఎస్ కార్యకర్తలు తెలంగాణ లగడపాటి అని ముద్దుగా పిలుచుకుంటున్నారు.
Advertisement