పోలీసును కొట్టిన టీఆర్ఎస్ ఎంపీ

నిజామాబాద్ జిల్లాలో గులాబీ ఎంపీ పాటిల్ వ్య‌వ‌హార శైలిపై సొంత‌పార్టీలోనే తీవ్ర విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. తాను ప్ర‌జాప్ర‌తినిధిని అన్న సంగ‌తి మ‌రిచి కోపం వ‌స్తే.. నిగ్ర‌హించుకోకపోవ‌డంపై మంత్రి హ‌రీశ్ రావు కూడా అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు. ఇంత‌కీ ఏమైందంటే.. శ‌నివారం మంత్రి హ‌రీశ్ రావు నిజామాబాద్ ప‌ర్య‌ట‌న చేప‌ట్టారు. ఈ పార్టీలో జ‌హీరాబాద్ ఎంపీ పాటిల్ కూడా పాల్గొన్నారు. ఎల్లారెడ్డిలో గిడ్డంగి ప్రారంభోత్స‌వంలో మంత్రి హ‌రీశ్ ప్రారంభించాల్సి ఉంది. ఈ కార్య‌క్ర‌మం అనంత‌రం మంత్రి హ‌రీశ్‌ను క‌లిసేందుకు […]

Advertisement
Update:2016-04-11 05:44 IST
నిజామాబాద్ జిల్లాలో గులాబీ ఎంపీ పాటిల్ వ్య‌వ‌హార శైలిపై సొంత‌పార్టీలోనే తీవ్ర విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. తాను ప్ర‌జాప్ర‌తినిధిని అన్న సంగ‌తి మ‌రిచి కోపం వ‌స్తే.. నిగ్ర‌హించుకోకపోవ‌డంపై మంత్రి హ‌రీశ్ రావు కూడా అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు. ఇంత‌కీ ఏమైందంటే.. శ‌నివారం మంత్రి హ‌రీశ్ రావు నిజామాబాద్ ప‌ర్య‌ట‌న చేప‌ట్టారు. ఈ పార్టీలో జ‌హీరాబాద్ ఎంపీ పాటిల్ కూడా పాల్గొన్నారు. ఎల్లారెడ్డిలో గిడ్డంగి ప్రారంభోత్స‌వంలో మంత్రి హ‌రీశ్ ప్రారంభించాల్సి ఉంది. ఈ కార్య‌క్ర‌మం అనంత‌రం మంత్రి హ‌రీశ్‌ను క‌లిసేందుకు నాయ‌కులు ఒక్క‌సారిగా ఎగ‌బ‌డ్డారు. ఈ స‌మ‌యంలో సొసైటీ చైర్మ‌న్ సాయిలు ఎంపీ పాటిల్‌పై తూలిప‌డ్డారు. దీంతో ఎంపీ గారి కోపం న‌శాలానికెక్కింది. నా మీదే ప‌డ‌తావా? అంటూ తోక తొక్కిన పాములా అంతెత్తున లేచారు. సాయిలును మూడుసార్లు వెన‌క్కి తోశారు.
ఎంపీగారి కోపం అంత‌టితో చ‌ల్లార‌లేదు. మ‌ధ్యాహ్నం పూట భోజ‌నాల స‌మ‌యంలో త‌న‌కు అడ్డొచ్చాడ‌ని ఓ కానిస్టేబుల్ చెంప చెల్లుమ‌నిపించాడు. విధులు నిర్వ‌హిస్తున్న కానిస్టేబుల్‌పై చేయిచేసుకోవ‌డంతో అక్క‌డికి వ‌చ్చిన‌వారంతా అవాక్క‌య్యారు. తీవ్రంగా నొచ్చుకున్న ఆ కానిస్టేబుల్ ఎంపీపై ఉన్న‌తాధికారుల‌కు ఫిర్యాదు చేయాలనుకున్నాడు. కానీ బుజ్జ‌గించ‌డంతో ఫిర్యాదు చేయ‌కుండానే వెన‌కకు వ‌చ్చాడు. ఎంపీ అనుచిత ప్ర‌వ‌ర్త‌న‌తో హ‌రీశ్ కూడా ఇబ్బంది ప‌డ్డాడ‌ట‌. దీంతో ఆయ‌న భోజ‌నం చేయ‌కుండానే మ‌ధ్య‌లోనే వ‌చ్చేశాడంట‌. ఎంపీ పాటిల్ ప్ర‌వ‌ర్త‌న‌పై కార్య‌క‌ర్త‌లు, పార్టీ నాయ‌కులు బ‌హిరంగంగానే విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు.
Tags:    
Advertisement

Similar News