చంద్రబాబు కలల రాష్ట్రంలో… విశ్వవిద్యాలయాల పరిస్థితి ఇది!
చంద్రబాబు నాయుడు చెప్పిన అమరావతి రాజధాని కథలు ఇంద్రలోకాన్ని తలపిస్తే, వాస్తవ పరిస్థితులు పాతాళాన్నికళ్లముందు ఉంచుతున్నాయి. కేంద్ర బడ్జెట్‌లో విశ్వవిద్యాలయాలకు చేసిన కేటాయింపులు చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. ఎపికి కేంద్రం ప్రకటించిన విశ్వవిద్యాలయాలకు ఈ ఏడాది బడ్జెట్‌లో కూడా అధ్వాన్నస్థాయిలో నిధులు మంజూరుచేశారు. ఒక్కో విశ్వవిద్యాలయ స్థాపనకు దాదాపు 1500కోట్ల రూపాయలు ఖర్చవుతుంది. కానీ కేంద్రం 20కోట్లు నుండి 40 కోట్లకు మించి కేటాయించలేదు. తిరుపతి ఐఐఐటి, వైజాగ్ ఐఐఎం, తాడేపల్లి గూడెం ఎన్ఐటి, తిరుపతి ఐఐటి, […]
చంద్రబాబు నాయుడు చెప్పిన అమరావతి రాజధాని కథలు ఇంద్రలోకాన్ని తలపిస్తే, వాస్తవ పరిస్థితులు పాతాళాన్నికళ్లముందు ఉంచుతున్నాయి. కేంద్ర బడ్జెట్‌లో విశ్వవిద్యాలయాలకు చేసిన కేటాయింపులు చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. ఎపికి కేంద్రం ప్రకటించిన విశ్వవిద్యాలయాలకు ఈ ఏడాది బడ్జెట్‌లో కూడా అధ్వాన్నస్థాయిలో నిధులు మంజూరుచేశారు. ఒక్కో విశ్వవిద్యాలయ స్థాపనకు దాదాపు 1500కోట్ల రూపాయలు ఖర్చవుతుంది. కానీ కేంద్రం 20కోట్లు నుండి 40 కోట్లకు మించి కేటాయించలేదు. తిరుపతి ఐఐఐటి, వైజాగ్ ఐఐఎం, తాడేపల్లి గూడెం ఎన్ఐటి, తిరుపతి ఐఐటి, తిరుపతి ఐఐఎస్ఇఆర్…. వీటన్నింటికీ ఒక్కోదానికి 40కోట్లకు మించి కేటాయింపులు జరగలేదు.
ఇంకా చెప్పాలంటే గత ఏడాది కంటే ఐఐఐటి తిరుపతి, ఐఐఎం వైజాగ్ లకు 25కోట్లు, 10కోట్ల చొప్పున తగ్గించారు. ఇక సెంట్రల్ యూనివర్శిటీ, గిరిజన యూనివర్శిటీ, పెట్రో యూనివర్శిటీలకు 1, 2 కోట్లతో సరిపెట్టారు. ఎయిమ్స్, వ్యవసాయ యూనివర్శిటీల మాటే లేదు. ఈ లెక్కన విశ్వవిద్యాలయాల స్థాపన జరగడానికి మరొక పాతికేళ్లు పడుతుందని విద్యార్థి సంఘాలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఇలా చూస్తే చంద్రబాబు చెబుతున్న విశ్వనగరం విద్యార్థులు పై చదువులకోసం విశ్వప్రయత్నాలు చేయాల్సిందేనని నిరాశ చెందుతున్నారు.
Click on image to read: