జగన్‌ సెల్ఫ్‌ గోల్‌

నిన్న తునిలో జరిగిన విధ్వంసం తరువాత ఆ మొత్తం పాపాన్ని జగన్‌ ఖాతాలో రాసేశారు చంద్రబాబు, ఆయన అనుబంధ మీడియా. దానికి కడుపుమండిన జగన్‌ ఈరోజు ప్రెస్‌మీట్‌ పెట్టాడు. చంద్రబాబును ఏకిపీకి పాకాన పెట్టాడు. కాపులకు రిజర్వేషన్‌ అమలుచేయడం సాధ్యం కాదని తెలిసి, రిజర్వేషన్‌ శాతం 50కి మించకూడదని తెలిసి కాపులకు రిజర్వేషన్‌ కల్పిస్తానని ఎలా ఎన్నికల హామీ ఇచ్చావు? అని నిలదీశాడు. కాపులకు, బీసీలకు మధ్య చిచ్చుపెట్టడానికే ఈ హామీ ఇచ్చాడని అన్నాడు. గతంలో మాల, […]

Advertisement
Update:2016-02-01 08:37 IST

నిన్న తునిలో జరిగిన విధ్వంసం తరువాత ఆ మొత్తం పాపాన్ని జగన్‌ ఖాతాలో రాసేశారు చంద్రబాబు, ఆయన అనుబంధ మీడియా. దానికి కడుపుమండిన జగన్‌ ఈరోజు ప్రెస్‌మీట్‌ పెట్టాడు. చంద్రబాబును ఏకిపీకి పాకాన పెట్టాడు. కాపులకు రిజర్వేషన్‌ అమలుచేయడం సాధ్యం కాదని తెలిసి, రిజర్వేషన్‌ శాతం 50కి మించకూడదని తెలిసి కాపులకు రిజర్వేషన్‌ కల్పిస్తానని ఎలా ఎన్నికల హామీ ఇచ్చావు? అని నిలదీశాడు. కాపులకు, బీసీలకు మధ్య చిచ్చుపెట్టడానికే ఈ హామీ ఇచ్చాడని అన్నాడు. గతంలో మాల, మాదిగల మధ్య కూడా ఇలాంటి చిచ్చేపెట్టాడని, కులాల మధ్య, ప్రాంతాల మధ్య, వర్గాల మధ్య, మనుషులమధ్య చిచ్చుపెట్టి అధికారంలో కొనసాగడమే చంద్రబాబు నైజం అని, వంగవీటి మోహనరంగ 1988లో బ్రహ్మాండమైన కాపు మహాసభ పెట్టాక ఆ ఏడాదే ఆయనను చంపేశారని ఆ నేరస్తులు ఇప్పుడు ఒకరు స్పీకరుగాను, ఒకరు మంత్రిగాను, మరికొందరు తెలుగుదేశంలోను కొనసాగుతున్నారని దుయ్యబట్టారు.

ఇంకా అనేక విషయాల్లో చంద్రబాబును చీల్చి చెండాడి ఎప్పటిప్రకారం, యధావిధిగా సుదీర్ఘ ఉపన్యాసం చేసి అవసరమైన విషయాలతో పాటు అనవరసరమైన విషయాలను అసందర్భంగా మాట్లాడి అసలు విషయాన్ని ఆయనకు ఆయనే పలుచన చేశాడు. అంతటితో వూరుకోక తమిళనాడు తరహాలో అసెంబ్లీలో తీర్మానం చేసి రిజర్వేషన్ల శాతాన్ని 69కి పెంచి కేంద్రంచేత అమోదముద్ర వేయించుకోవాలని, ఆవిధంగా కాపుల, బీసీల మధ్య రిజర్వేషన్‌ సమస్యను పరిష్కరించుకోవాలని చంద్రబాబుకు ఒక ఉచిత సలహా ఇచ్చాడు. ఆ మాత్రం చంద్రబాబుకు తెలియదా? జగన్‌ ఇలా అతిగా మాట్లాడి, అనవసర విషయాలు మాట్లాడి కొన్ని వర్గాలను దూరం చేసుకుంటున్నాడు.

బీజేపీ అధికారంలోకి వచ్చాక రిజర్వేషన్లకు వ్యతిరేకంగా కొన్ని కులాలు, కొన్ని వర్గాలు ఉద్యమిస్తున్న వేళ రిజర్వేషన్ల శాతం పెంచమనే సలహాతో కొన్ని వర్గాలకు జగన్‌ దూరమయ్యేలా తనకు తానే సెల్ఫ్‌గోల్‌ వేసుకున్నాడు.

Tags:    
Advertisement

Similar News