కేసీఆర్ భార్యకే అర్థం కావ‌డం లేదట‌ ..

జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల వేళ టీఆర్ఎస్, టీడీపీలు పంచ్‌లు విసురుకుంటున్నారు. శ‌నివారం జ‌రిగిన టీఆర్ఎస్ బ‌హిరంగ స‌భ‌లో చంద్ర‌బాబు భార్య భువ‌నేశ్వ‌రి కూడా త‌మ‌కే ఓటేస్తార‌ని ఆమేరకు ఆమె మాట ఇచ్చార‌ని కేసీఆర్ చెప్పిన నేప‌థ్యంలో లోకేష్ కౌంట‌ర్ ఇచ్చారు. లోకేష్ కూడా కేసీఆర్ భార్య‌ను తెర‌పైకి తెచ్చారు. లోకేష్ ఏమ‌న్నారంటే “మూడు రోజుల క్రితం కేసీఆర్ క్యాంపు ఆఫీసులో ప‌నిచేసే వారు ఆయ‌న భార్య‌ను క‌లిశారు. మేడ‌మ్ హైద‌రాబాద్‌లో అంద‌రూ టీడీపీకి ఓటేయ‌మంటున్నారు, ఏం చేయమంటారు అని […]

Advertisement
Update:2016-01-31 07:23 IST

జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల వేళ టీఆర్ఎస్, టీడీపీలు పంచ్‌లు విసురుకుంటున్నారు. శ‌నివారం జ‌రిగిన టీఆర్ఎస్ బ‌హిరంగ స‌భ‌లో చంద్ర‌బాబు భార్య భువ‌నేశ్వ‌రి కూడా త‌మ‌కే ఓటేస్తార‌ని ఆమేరకు ఆమె మాట ఇచ్చార‌ని కేసీఆర్ చెప్పిన నేప‌థ్యంలో లోకేష్ కౌంట‌ర్ ఇచ్చారు. లోకేష్ కూడా కేసీఆర్ భార్య‌ను తెర‌పైకి తెచ్చారు. లోకేష్ ఏమ‌న్నారంటే “మూడు రోజుల క్రితం కేసీఆర్ క్యాంపు ఆఫీసులో ప‌నిచేసే వారు ఆయ‌న భార్య‌ను క‌లిశారు. మేడ‌మ్ హైద‌రాబాద్‌లో అంద‌రూ టీడీపీకి ఓటేయ‌మంటున్నారు, ఏం చేయమంటారు అని అడిగారు. అందుకు మేడ‌మ్ ఎవ‌రికి ఓటేయాల‌న్న‌ది త‌న‌కే అర్థం కావ‌డం లేద‌ని వారితో అన్నారు. క‌విత ఏమో ఎంఐఎంతో పొత్తు లేదంటారు, మా ఆయ‌నేమో పొత్తు ఉంది అంటారు. కేటీఆర్ భీమ‌వ‌రం వెళ్లి పోటీ చేస్తా అంటారు. ఏం చేయాలో అర్థం కావ‌డం లేదు” అని కేసీఆర్ భార్య అన్నార‌ని లోకేష్ చెప్పారు.

హైద‌రాబాద్‌లో ఎక్క‌డికి వెళ్లినా టీడీపీ చేసిన అభివృద్దే క‌నిపిస్తోంద‌ని అందుకే కేసీఆర్ ప్రచారానికి రావ‌డం లేద‌న్నారు. త‌మ‌కు విశ్వ‌న‌గ‌రం వ‌ద్ద‌ని కేవ‌లం మంచి నీళ్లు ఇచ్చి చెత్త లేకుండా చేస్తే చాల‌న్నారు లోకేష్. చంద్ర‌బాబు మోదీకి కాల్ చేయ‌డంతో 50 వేల ఇళ్లు తెలంగాణ‌కు మంజూరు చేశార‌ని లోకేష్ చెప్పారు. కేసీఆర్ స‌భ చూస్తే త‌న‌కే న‌వ్వొచ్చింద‌న్నారు. ఉప్పు లేని కూర‌లాగా కేసీఆర్ స‌భ సాగింద‌ని ఎద్దేవా చేశారు. గ్రేట‌ర్ ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా లోకేష్ మియాపూర్‌లో ప‌ర్య‌టించారు.

Click on image to read:

Tags:    
Advertisement

Similar News