జమ్మలమడుగు వైసీపీ ఇన్‌చార్జ్ ఎవరు?

వైసీపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి టీడీపీలో చేరేందుకు సిద్ధపడడంతో జమ్మలమడుగులో ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని సిద్ధం చేసే పనిలో వైసీపీ ఉంది.( ఫిబ్రవరి 5న టీడీపీలో చేరవచ్చని ఆది బంధువు ఒకరు మీడియాతో చెప్పారు). జమ్మలమడుగు వైసీపీ ఇన్‌చార్జ్‌ రేసులో పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. ఇటీవల జగన్ జమ్మలమడుగులో పర్యటించిన సమయంలో అల్లే ప్రభావతి ఇంటికి నేరుగా వెళ్లారు. ఆమె కూడా జగన్ వెంట పర్యటించారు. దీంతో ఆమెను నియోజకవర్గ ఇన్‌చార్జ్  చేస్తారని భావించారు. అయితే ఇప్పుడు డాక్టర్ సుధీర్‌ రెడ్డి పేరు […]

Advertisement
Update:2016-01-29 04:02 IST
జమ్మలమడుగు వైసీపీ ఇన్‌చార్జ్ ఎవరు?
  • whatsapp icon

వైసీపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి టీడీపీలో చేరేందుకు సిద్ధపడడంతో జమ్మలమడుగులో ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని సిద్ధం చేసే పనిలో వైసీపీ ఉంది.( ఫిబ్రవరి 5న టీడీపీలో చేరవచ్చని ఆది బంధువు ఒకరు మీడియాతో చెప్పారు). జమ్మలమడుగు వైసీపీ ఇన్‌చార్జ్‌ రేసులో పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. ఇటీవల జగన్ జమ్మలమడుగులో పర్యటించిన సమయంలో అల్లే ప్రభావతి ఇంటికి నేరుగా వెళ్లారు. ఆమె కూడా జగన్ వెంట పర్యటించారు. దీంతో ఆమెను నియోజకవర్గ ఇన్‌చార్జ్ చేస్తారని భావించారు. అయితే ఇప్పుడు డాక్టర్ సుధీర్‌ రెడ్డి పేరు కూడా వినిపిస్తోంది. మైసూరారెడ్డి సోదరుడి కుమారుడైన సుధీర్ రెడ్డి కొద్ది రోజులుగా నియోజవకర్గంలో పర్యటిస్తూ వైసీపీ నేతలను కలుస్తున్నారని కథనాలు వస్తున్నాయి. దీంతో ఇన్‌చార్జ్ పదవికి సుధీర్‌ రెడ్డి పేరు కూడా వినిపిస్తోంది. అయితే ప్రభావతి, సుధీర్ రెడ్డి ఇద్దరూ కూడా కలిసే పని చేస్తున్నారు. వీరిలో ఎవరికి ఇన్‌చార్జ్‌గా బాధ్యతలు అప్పగించినా ఇబ్బందులు, అలకలు ఎదురయ్యే అవకాశం లేదని చెబుతున్నారు.

వైసీపీ నాయకత్వం మాత్రం ఇన్‌చార్జ్ పేరు విషయంలో బయటపడడం లేదు. ఆదినారాయణ టీడీపీలో చేరిన తర్వాత జరిగే పరిణామాలను అంచనా వేసుకుని ముందుకెళ్లాలని భావిస్తోంది. ఆదినారాయణరెడ్డి టీడీపీలో చేరితే ఆయనకు బద్ధశత్రువైన రామసుబ్బారెడ్డి బయటకు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. అదే జరిగితే జమ్మలమడుగు వైసీపీ బాధ్యతలు రామసుబ్బారెడ్డికి అప్పగించే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే టీడీపీ నేతలు మాత్రం ఆది వచ్చి రామసుబ్బారెడ్డి బయటకు వెళ్తే లాభం కన్నా నష్టమే అధికమని భావిస్తున్నారు. కాబట్టి ఎలాగైనా సరే రామసుబ్బారెడ్డిని బుజ్జగించే పనిలో ఉన్నారు. 2019 నాటికి రాష్ట్రంలో ఏపీలో నియోజకవర్గాల సంఖ్య 175 నుంచి 225కు పెరుగుతుందని కాబట్టి మీకొచ్చిన ఇబ్బంది ఏమీ ఉండదంటూ రామసుబ్బారెడ్డిని టీడీపీ నేతలు దువ్వుతున్నారు. ఈ ప్రయత్నంలో టీడీపీ ఎంతవరకు సఫలమవుతుందో చూసుకుని ఆ తర్వాత జమ్మలమడుగు నియోజకవర్గానికి ఇన్‌చార్జ్‌ను ప్రకటించే యోచనలో వైసీపీ ఉందని చెబుతున్నారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News