ఐసిస్ కు ధీటుగా ధర్మసేన!
ఐసిస్.. ఈ పేరు చెబితేనే ఇప్పుడు యావత్ ప్రపంచం గడగడలాడుతోంది. ఇప్పటికే ఇరాన్, సిరియా దేశాలతోపాటు ప్రపంచ నలుమూలలకు ఐసిస్ విస్తరిస్తోంది. ఈ పరిస్థితుల్లో మన దేశంపైగా ఐసిస్ కన్నేసింది. జనవరి 26న జరిగే రిపబ్లిక్ వేడుకలకు ఫ్రాన్స్ అధ్యక్షుడు హోలండో ముఖ్య అతిథిగా వస్తున్నారు. ఇప్పటికే ఉగ్రమూకలు రిపబ్లిక్ డే ని టార్గెట్ చేసినట్టు ఇంటలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్ సహా పలు నగరాల్లో అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఐసిస్ ఉగ్రవాదులను […]
Advertisement
ఐసిస్.. ఈ పేరు చెబితేనే ఇప్పుడు యావత్ ప్రపంచం గడగడలాడుతోంది. ఇప్పటికే ఇరాన్, సిరియా దేశాలతోపాటు ప్రపంచ నలుమూలలకు ఐసిస్ విస్తరిస్తోంది. ఈ పరిస్థితుల్లో మన దేశంపైగా ఐసిస్ కన్నేసింది. జనవరి 26న జరిగే రిపబ్లిక్ వేడుకలకు ఫ్రాన్స్ అధ్యక్షుడు హోలండో ముఖ్య అతిథిగా వస్తున్నారు. ఇప్పటికే ఉగ్రమూకలు రిపబ్లిక్ డే ని టార్గెట్ చేసినట్టు ఇంటలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్ సహా పలు నగరాల్లో అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఐసిస్ ఉగ్రవాదులను ధీటుగా ఎదుర్కొనడానికి హిందూసంస్ధల ఆధ్వర్యంలో ఉత్తర ప్రదేశ్ లో ఓ ప్రజా సైన్యాన్ని తయారుచేస్తున్నట్టు తెలుస్తోంది.
భారత్ లో బలపడేందుకు ప్రయత్నిస్తున్న ఐసిస్ ను ఎదుర్కొనాలంటే ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని, ఉగ్రవాదం పట్ల ఆకర్శితులు కాకుండా చర్యలు తీసుకోవాలని భావించిన హిందూ స్వాభిమాన్ సంస్థ ధర్మసేన పేరుతో ప్రజా సైన్యాన్ని తయారు చేస్తోంది. ఇది యూపీ, ఉత్తరాఖండ్ లో సుమారు 50కిపైగా శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేసింది. ఇందులో వేలమంది యువతకు, పెద్దలకు శిక్షణ ఇస్తున్నారు. ఇందులో పిల్లలకూ రైఫిల్, పిస్తోల్ షూటింగ్, విలువిద్యలో ట్రైనింగ్ ఇస్తున్నారు. ఇప్పటి వరకు సుమారు 15వేల మందికి షూటింగ్ తో పాటు కత్తిసాము, విలువిద్యలో శిక్షణ పూర్తి చేసుకున్నారు. అయితే ఇది కేవలం ప్రైవేట్ గా ఇస్తున్న శిక్షణ అని తెలుస్తోంది. కొందరు మాజీ ఆర్మీ అధికారులు, హిందూవాహిని సంస్థతోపాటు పలు సామాజిక సంస్థలు ఇందులో భాగస్వామ్యం అయ్యాయట.
Advertisement