తిక్క పవన్‌కు ఎప్పుడో చుక్కలు చూపించాం

జనసేన అధినేత, నటుడు పవన్ కల్యాణ్‌పై టీఆర్‌ఎస్‌ ఎంపీ కవిత సెటైర్లు వేశారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ- టీడీపీ కూటమి తరపున ప్రచారం చేసేందుకు పవన్ వస్తారన్న ప్రచారం నేపథ్యంలో ఆమె వ్యాఖ్యలు చేశారు. తిక్క పవన్‌ ఎన్నికల ప్రచారానికి వస్తారట… అయినా ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తిక్క పవన్‌కు కేసీఆర్‌ ఎప్పుడో చుక్కలు చూపించారని కవిత అన్నారు. మేకప్‌తో ప్రచారానికి రావడంతో ఎన్నికలు అయిపోగానే ప్యాకప్ చెప్పడం పవన్‌కు అలవాటేనని ఎద్దేవా […]

Advertisement
Update:2016-01-09 12:46 IST

జనసేన అధినేత, నటుడు పవన్ కల్యాణ్‌పై టీఆర్‌ఎస్‌ ఎంపీ కవిత సెటైర్లు వేశారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ- టీడీపీ కూటమి తరపున ప్రచారం చేసేందుకు పవన్ వస్తారన్న ప్రచారం నేపథ్యంలో ఆమె వ్యాఖ్యలు చేశారు. తిక్క పవన్‌ ఎన్నికల ప్రచారానికి వస్తారట… అయినా ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తిక్క పవన్‌కు కేసీఆర్‌ ఎప్పుడో చుక్కలు చూపించారని కవిత అన్నారు. మేకప్‌తో ప్రచారానికి రావడంతో ఎన్నికలు అయిపోగానే ప్యాకప్ చెప్పడం పవన్‌కు అలవాటేనని ఎద్దేవా చేశారు. ఎన్నికలనగానే గంగిరెద్దుల్లా కొందరు వస్తారని పవన్‌ను ఉద్దేశించి కవిత అన్నారు.

Tags:    
Advertisement

Similar News