సీమలో చినబాబు కుల చిచ్చు?
దేశంలో కుల రాజకీయాలు కొత్తకాదు. కానీ రానురాను ఈ పరిస్థితి తగ్గుతుందన్న భావన ఉంది. కానీ యువ నాయకులు కూడా కుల జపం చేయడం ఆశ్చర్యాన్ని ఆందోళన కలిగిస్తోంది. తాజాగా టీడీపీ నేత లోకేష్ బాబు రాయలసీమలో బలిజ కులానికి రాజకీయంగా ప్రాధాన్యత ఇస్తామని చెప్పడం చర్చనీయాంశమైంది. ఇలా చెప్పడం వెనుక పెద్ద ప్లాన్ ఉందని భావిస్తున్నారు. అన్ని పార్టీలు కుల రాజకీయాలు చేస్తున్నా ఇలా నేరుగా ఒక కులం పేరు ప్రస్తావించి ప్రాధాన్యత ఇస్తామనడం సరైనది కాదేమోనన్న […]
దేశంలో కుల రాజకీయాలు కొత్తకాదు. కానీ రానురాను ఈ పరిస్థితి తగ్గుతుందన్న భావన ఉంది. కానీ యువ నాయకులు కూడా కుల జపం చేయడం ఆశ్చర్యాన్ని ఆందోళన కలిగిస్తోంది. తాజాగా టీడీపీ నేత లోకేష్ బాబు రాయలసీమలో బలిజ కులానికి రాజకీయంగా ప్రాధాన్యత ఇస్తామని చెప్పడం చర్చనీయాంశమైంది. ఇలా చెప్పడం వెనుక పెద్ద ప్లాన్ ఉందని భావిస్తున్నారు. అన్ని పార్టీలు కుల రాజకీయాలు చేస్తున్నా ఇలా నేరుగా ఒక కులం పేరు ప్రస్తావించి ప్రాధాన్యత ఇస్తామనడం సరైనది కాదేమోనన్న భావన వ్యక్తమవుతోంది. ఏపీ కాపు కార్పోరేషన్ చైర్మన్‌గా నియమితులైన రామాంజనేయుడు, డైరెక్టర్లు తనను కలిసిన సమయంలో లోకేష్ ఈ వ్యాఖ్యలు చేశారు. రాయలసీమలో బలిజలకు ప్రాధాన్యం ఇస్తున్న విషయం ప్రజలలోకి తీసుకు వెళ్లవలసిన బాధ్యత డైరెక్టర్ రాయల మురళీ పై ఉందని లోకేష్ అన్నారు.
Click to Read: ఈ సెటైర్లు కేసీఆర్‌పైనా?.. బాబుపైనా?
బలిజ సామాజికవర్గం కూడా కాపుల్లో ఒక భాగమే. కాపు సామాజికవర్గం వారు సీమతో పాటు గుంటూరు, కృష్ణా, గోదావరి జిల్లాల్లోనూ ఉన్నారు. కానీ అక్కడ పలాన కులానికి ప్రాధాన్యత ఇస్తామని చెప్పని లోకేష్ కేవలం సీమలో బలిజలను ప్రోత్సహిస్తామని చెప్పడంపై కొన్ని లెక్కలున్నాయంటున్నారు. రాయలసీమలో రాజకీయంగా రెడ్డి సామాజికవర్గం బలంగా ఉంది. అదేసమయంలో లోకేష్ సొంతసామాజికవర్గం ప్రభావం కొన్ని ప్రాంతాలకే పరిమితం. ఈ నేపథ్యంలో రెడ్డి సామాజికవర్గాన్ని ఎదుర్కొనేందుకే బలిజలను ఉసిగొల్పుతున్నారని చెబుతున్నారు. కోస్తా జిల్లాల్లో కాపులను ప్రోత్సహిస్తామని చెప్పకపోవడానికి కారణం ఆయా జిల్లాల్లో లోకేష్ సొంత సామాజికవర్గం రాజకీయంగా బలంగా ఉంది. కాబట్టి అక్కడ తన సామాజికవర్గాన్ని ప్రోత్సాహించి… ఇతర ప్రాంతాల్లో ప్రత్యర్థులపైకి ఇలా ఇతర సామాజికవర్గాలను ఉసిగొల్పుతున్నారన్న అభిప్రాయం ఉంది.
లోకేష్ మాటల విన్న తర్వాత సీమలో బలిజలు టీడీపీ తరపున బలంగా పోరాటం చేస్తారని దాన్ని క్యాష్ చేసుకునే ఆలోచన ఉండవచ్చని చెబుతున్నారు. ఈ ఎత్తుగడను టీడీపీ ఆవిర్భావ సమయంలోనే ప్రయోగించారని అంటుంటారు. అప్పటికే రాజకీయంగా బలంగా ఉన్న వర్గాలను ఎదుర్కొనేందుకు… ప్రత్యేకంగా కొన్ని సామాజికవర్గాలను టీడీపీ ఉపయోగించుకుందని రాజకీయ విశ్లేషకులు చెబుతుంటారు. అది కూడా టీడీపీ తన సొంత పార్టీ భావించే ఒక సామాజివర్గ ప్రభావం లేని ప్రాంతాల్లో ఈ అస్త్రాన్ని అప్పట్లో ప్రయోగించారు. ఏదీ ఏమైనా కులమతాలకు అతీతమైన సమాజాన్ని నిర్మించడంలో ముందుండాల్సిన ఒక యువనేత ఇలా ఒక కులానికి ప్రాధాన్యత ఇస్తామంటూ ప్రకటించడం చివరకు కులాల కుంపట్లను మరింత రగిలించినట్టు అవుతుంది. ఇప్పటికే కుల రాజకీయాల బారినపడ్డ ఆంధ్రప్రదేశ్‌కు ఈ పరిణామం మరింత చెడు చేసే అవకాశం ఉంది. అయితే పదవులు కాపులకు ఇచ్చినా వాటిపై అధిపత్యం మాత్రం వారికుండదని మరికొందరంటున్నారు. ఇందుకు డిప్యూటీసీఎం, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్పను ఉదాహరణగా చూపుతున్నారు.