కామ సీఎం అని నేను కూడా అన్నా...
అసెంబ్లీలో ప్రభుత్వం అనుసరించిన తీరు వైసీపీ అధ్యక్షుడు జగన్ ఆక్షేపించారు. కాల్‌మనీ సెక్స్ రాకెట్ నుంచి తప్పించుకునేందుకు చివరకు అంబేద్కర్‌ను కూడా వాడుకునే స్థాయికి చంద్రబాబు దిగజారారని మండిపడ్డారు. చర్చను తప్పుదారి పట్టించేందుకు రోజాను ఏడాది పాటు సస్పెండ్ చేశారని విమర్శించారు. చంద్రబాబును కాల్‌మనీ సీఎం, కామ సీఎం అని తనతో సహా అందరూ అన్నారని అలాంటప్పుడు ఒక్క రోజాపైనే ఎందుకు చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, ఇంటెలిజెన్స్ డీజీ వంటి పెద్దపెద్ద […]
అసెంబ్లీలో ప్రభుత్వం అనుసరించిన తీరు వైసీపీ అధ్యక్షుడు జగన్ ఆక్షేపించారు. కాల్‌మనీ సెక్స్ రాకెట్ నుంచి తప్పించుకునేందుకు చివరకు అంబేద్కర్‌ను కూడా వాడుకునే స్థాయికి చంద్రబాబు దిగజారారని మండిపడ్డారు. చర్చను తప్పుదారి పట్టించేందుకు రోజాను ఏడాది పాటు సస్పెండ్ చేశారని విమర్శించారు. చంద్రబాబును కాల్‌మనీ సీఎం, కామ సీఎం అని తనతో సహా అందరూ అన్నారని అలాంటప్పుడు ఒక్క రోజాపైనే ఎందుకు చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, ఇంటెలిజెన్స్ డీజీ వంటి పెద్దపెద్ద వారి ప్రమేయం ఉన్న కాల్‌మనీ కేసును నీరుగార్చేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. అసలు అసెంబ్లీకి విలువ ఉందా అని ప్రశ్నించారు.
వైసీపీ సమావేశాలను బాయ్‌కాట్ చేసిన రెండు రోజులకు తిరిగి అసెంబ్లీలో రోజాను, జగన్‌ను తిట్టించే కార్యక్రమం చేశారని విమర్శించారు. రోజా బయటకు వెళ్తేనే ప్రతిపక్ష నాయకుడికి మాట్లాడే అవకాశం ఇస్తామని స్పీకర్ చెప్పడానికి మించిన దారుణం ఏమైనా ఉంటుందా అని ప్రశ్నించారు. అసెంబ్లీని టైమ్ పాస్ కోసం నడిపారని విమర్శించారు. వందలాది మంది మహిళల మానప్రాణాలతో చెలగాటమాడిన కేసులో ఎమ్మెల్సీ సోదరుడిపై స్టేషన్ బెయిల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేయడాన్ని ఏమనుకోవాలని అని అన్నారు. బాక్సైట్‌పై మాట్లాడుతున్న చంద్రబాబు అసలు జీవో నెంబర్ 97ను ఎందుకు రద్దు చేయలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎలాంటి చర్చ లేకుండానే ముఖ్యమైన బిల్లులను ఏకపక్షంగా ఆమోదించుకున్నారని జగన్ ఆక్షేపించారు.