కేసీఆర్‌ను గీతారెడ్డి అంతపెద్ద పదవి అడిగారా?
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి గీతారెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరుతారంటూ చాలా కాలంగా ప్రచారం సాగుతోంది. టీఆర్ఎస్‌లో వెళ్లిపోవడానికి దాదాపు నిర్ణయించుకోవడం వల్లే ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికలపై సీఎల్పీ నిర్వహించిన సమావేశానికి గీతారెడ్డి హాజరుకాలేదని చెబుతున్నారు అయితే ఈ అంశంపై ఇప్పుడు దాదాపు క్లారిటీ వచ్చిందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. గీతారెడ్డి కాంగ్రెస్‌ను వీడబోరని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. అయితే ఇలా హఠాత్తుగా నిర్ణయం మార్చుకోవడం వెనుక అసలు కారణం వేరే ఉందని అంటున్నారు. గీతారెడ్డిని పార్టీలోకి […]
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి గీతారెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరుతారంటూ చాలా కాలంగా ప్రచారం సాగుతోంది. టీఆర్ఎస్‌లో వెళ్లిపోవడానికి దాదాపు నిర్ణయించుకోవడం వల్లే ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికలపై సీఎల్పీ నిర్వహించిన సమావేశానికి గీతారెడ్డి హాజరుకాలేదని చెబుతున్నారు అయితే ఈ అంశంపై ఇప్పుడు దాదాపు క్లారిటీ వచ్చిందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. గీతారెడ్డి కాంగ్రెస్‌ను వీడబోరని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. అయితే ఇలా హఠాత్తుగా నిర్ణయం మార్చుకోవడం వెనుక అసలు కారణం వేరే ఉందని అంటున్నారు. గీతారెడ్డిని పార్టీలోకి చేర్చుకునేందుకు కేసీఆర్ కూడా చాలా సానుకూలంగా స్పందించారు. పార్టీలోకి వస్తే మంచి గౌరవం ఇస్తామని కూడా హామీ ఇచ్చారట.
అయితే గీతారెడ్డి మాత్రం ఏకంగా డిప్యూటీ సీఎం పదవి అడిగారని అధికార పార్టీ నేతలు చెబుతున్నారు. ఇందుకు కేసీఆర్ నో చెప్పారట. పార్టీలోకి వస్తే డీఎస్ తరహాలోనే మంచి పోస్ట్ ఇస్తామని మాత్రమే హామీ ఇచ్చినట్టు చెప్పుకుంటున్నారు. డీఎస్ తరహాలో అనే సరికి గీతారెడ్డి వెనక్కు తగ్గారని చెబుతున్నారు. ఎందుకంటే డీఎస్ తనకు ఇచ్చిన పోస్టుపై నిత్యం అసంతృప్తితో ఉన్నారు. అలాంటి పదవి కోసం పార్టీ మారాల్సిన అవసరం లేదని గీతారెడ్డి నిర్ణయించుకున్నారని అంటున్నారు. అయితే కాంగ్రెస్‌ను దెబ్బతీసేందుకు టీఆర్‌ఎస్ నేతలు కొందరు పనిగట్టుకుని గీతారెడ్డి పార్టీ మారుతారంటూ ప్రచారం చేస్తున్నారని మరికొందరు రుసరుసలాడుతున్నారు. ఏదీ ఏమైనా టీఆర్ఎస్, గీతారెడ్డి మధ్య పొత్తు కుదరలేదన్నది మాత్రం వాస్తవమని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.