కడపలో స్టీల్ ప్లాంట్‌- కాగుతున్న నూనెలో చేయి పెట్టడమేనా?

కడప ఉక్కు ఫ్యాక్టరీకి కేంద్రం షాకిచ్చింది. కడపలో స్టీల్ ఫ్యాక్టరీ నిర్మించేందుకు అవకాశాలు పరిశీలిస్తామని విభజన చట్టంలో చెప్పిన కేంద్రం ఇప్పుడు కుదరదని తేల్చేసింది. కడపలో స్టీల్ ఫ్యాక్టరీ గిట్టుబాటు కాదని స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా- సెయిల్ ప్రకటించింది. కడప జిల్లాలో లభించే ముడి ఇనుప ఖనిజం తక్కువ మొత్తంలో ఉందని.. స్టీల్ ఫ్యాక్టరీ అవసరాలను తీర్చలేదని సెయిల్ అభిప్రాయపడింది. అక్కడనున్న ముడి ఖనిజాన్ని నమ్ముకుని ఫ్యాక్టరీ పెట్టలేదని చెప్పింది. దేశంలో ఇప్పటికే ఉక్కు పరిశ్రమ […]

Advertisement
Update:2015-12-10 02:46 IST

కడప ఉక్కు ఫ్యాక్టరీకి కేంద్రం షాకిచ్చింది. కడపలో స్టీల్ ఫ్యాక్టరీ నిర్మించేందుకు అవకాశాలు పరిశీలిస్తామని విభజన చట్టంలో చెప్పిన కేంద్రం ఇప్పుడు కుదరదని తేల్చేసింది. కడపలో స్టీల్ ఫ్యాక్టరీ గిట్టుబాటు కాదని స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా- సెయిల్ ప్రకటించింది. కడప జిల్లాలో లభించే ముడి ఇనుప ఖనిజం తక్కువ మొత్తంలో ఉందని.. స్టీల్ ఫ్యాక్టరీ అవసరాలను తీర్చలేదని సెయిల్ అభిప్రాయపడింది. అక్కడనున్న ముడి ఖనిజాన్ని నమ్ముకుని ఫ్యాక్టరీ పెట్టలేదని చెప్పింది.

దేశంలో ఇప్పటికే ఉక్కు పరిశ్రమ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోందని… ఈ పరిస్థితిలో కడపలో ఉక్కు ఫ్యాక్టరీ పెట్టడం అంటే కాగుతున్న నూనెలో చేయి పెట్టడమేనని సెయిల్ తన నివేదికలో స్పష్టం చేసింది. అయితే సెయిల్ నివేదకపై పలువురు కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కడప స్టీల్ ప్లాంట్ అడ్డుకునే కుట్ర ఏమైనా ఈ నివేదిక వెనుక ఉందా అని అనుమానిస్తున్నారు. సెయిల్‌ నివేదికను సాకుగా చూసి ప్లాంట్ నిర్మాణం ప్రైవేట్ కంపెనీలకు అప్పగించే ప్రయత్నాలు జరగవచ్చని భావిస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News