ఆ కారణంలో భార్యకు విడాకులు కుదరదు: సుప్రీం
సుప్రీం కోర్టు మరో కీలక తీర్పు వెలువరించింది. భార్య అనారోగ్యం ఉండగా విడాకులు మంజూరు చేయడం కుదరదని తేల్చి చెప్పింది. చికిత్స కోసం డబ్బులు ఇచ్చే సాకుతో భార్య నుంచి విడాకులు తీసుకోవడాన్ని అనుమతించబోమని స్పష్టం చేసింది. భార్య అనారోగ్యంతో బాధపడుతున్న సమయంలో అండగా ఉండడం భర్త విధి అని తేల్చిచెప్పింది. Click to Read: అడిగాను… తప్పేంటి? రొమ్ము కాన్సర్‌తో బాధపడుతున్న భార్య నుంచి విడాకులు తీసుకునేందుకు ఓ వ్యక్తి చేసుకున్న వినతిని నిశితంగా పరిశీలించిన […]
సుప్రీం కోర్టు మరో కీలక తీర్పు వెలువరించింది. భార్య అనారోగ్యం ఉండగా విడాకులు మంజూరు చేయడం కుదరదని తేల్చి చెప్పింది. చికిత్స కోసం డబ్బులు ఇచ్చే సాకుతో భార్య నుంచి విడాకులు తీసుకోవడాన్ని అనుమతించబోమని స్పష్టం చేసింది. భార్య అనారోగ్యంతో బాధపడుతున్న సమయంలో అండగా ఉండడం భర్త విధి అని తేల్చిచెప్పింది.
Click to Read: అడిగాను… తప్పేంటి?
రొమ్ము కాన్సర్‌తో బాధపడుతున్న భార్య నుంచి విడాకులు తీసుకునేందుకు ఓ వ్యక్తి చేసుకున్న వినతిని నిశితంగా పరిశీలించిన న్యాయస్థానం ఈ మేరకు స్పందించింది. విడాకులు ఇస్తే 12.5 లక్షలు ఇస్తానంటూ సదరు వ్యక్తి భార్యతో కుదుర్చుకున్న ఒప్పందం సుప్రీం దృష్టికి వచ్చింది. దీంతో అసలు ఉద్దేశాన్ని కోర్టు పసిగట్టింది. మహిళకు విడాకులు ఇష్టం లేదని కానీ తన వైద్య ఖర్చులకు కోసం మరో దారి లేక భర్త చెప్పినట్టు చేస్తోందని నిర్దారించింది. కాబట్టి ఈ కారణంతో విడాకులు మంజూరు చేయడం కుదరదని తేల్చిచెప్పింది. వెంటనే ఆమె వైద్య ఖర్చు కోసం రూ. 5లక్షలు చెల్లించాలని ఆదేశించింది. ఈ సందర్భంగా పలు మతాల పవిత్ర గ్రంథాల్లో భార్యభర్తల సంబంధంపై చెప్పిన వ్యాఖ్యలను ధర్మాసనం ఉటంకించింది.
Click to Read: When KCR’s best friend meets KCR’s worst enemy!