నాయుడు వర్సెస్ చౌదరి! రియల్ ఫైటేనా?

వెంకయ్యనాయుడు. సొంత పార్టీ నేతల కన్నా చంద్రబాబు అంటేనే ఆయనకు ఎక్కువ ఇష్టమని చెబుతుంటారు. చంద్రబాబుపై ఢిల్లీలో ఈగ వాలకుండా చూసేది కూడా వెంకయ్యనాయుడేనని టీడీపీ నేతలు అంటుంటారు. అలాంటి వెంకయ్యనాయుడు వ్యాఖ్యలకే టీడీపీకి చెందిన కేంద్రమంత్రి సుజనాచౌదరి కౌంటర్ ఇవ్వడం చర్చనీయాంశమైంది. వీరిద్దరి మధ్య వార్‌కు ఏపీ ప్రత్యేక హోదా అంశం వేదికైంది. ఇటీవల రాజ్యసభలో మాట్లాడిన వెంకయ్యనాయుడు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా రావడం తనకూ ఇష్టమేనని అయితే దానికి ఏకాభిప్రాయం అవసరమని చెప్పారు. ప్రత్యేక […]

Advertisement
Update:2015-12-03 10:30 IST

వెంకయ్యనాయుడు. సొంత పార్టీ నేతల కన్నా చంద్రబాబు అంటేనే ఆయనకు ఎక్కువ ఇష్టమని చెబుతుంటారు. చంద్రబాబుపై ఢిల్లీలో ఈగ వాలకుండా చూసేది కూడా వెంకయ్యనాయుడేనని టీడీపీ నేతలు అంటుంటారు. అలాంటి వెంకయ్యనాయుడు వ్యాఖ్యలకే టీడీపీకి చెందిన కేంద్రమంత్రి సుజనాచౌదరి కౌంటర్ ఇవ్వడం చర్చనీయాంశమైంది. వీరిద్దరి మధ్య వార్‌కు ఏపీ ప్రత్యేక హోదా అంశం వేదికైంది.

ఇటీవల రాజ్యసభలో మాట్లాడిన వెంకయ్యనాయుడు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా రావడం తనకూ ఇష్టమేనని అయితే దానికి ఏకాభిప్రాయం అవసరమని చెప్పారు. ప్రత్యేక హోదా అంశం తేనెతుట్టె లాంటిదని దాన్ని ఒక్కసారి కదిలిస్తే చాలా రాష్ట్రాలు కూడా అదే డిమాండ్‌తో ముందుకొస్తాయన్నారు. వెంకయ్య వ్యాఖ్యలపై సుజనా చౌదరి కౌంటర్‌ ఇచ్చారు. ఎన్టీఏ హాయంలో ఏర్పడిన ఉత్తరాంచల్, చత్తీస్‌ఘడ్, జార్ఖండ్ విషయంలో ఏకాభిప్రాయం సాధించే నిర్ణయం తీసుకున్నారా అని ఎదురు ప్రశ్నించారు. ప్రత్యేక హోదా కోసం ఏకాభిప్రాయం అక్కర్లేదని తేల్చేశారు. అసలు వెంకయ్యనాయుడు ఎందుకు అలా మాట్లాడుతున్నారో తమకు అర్థం కాలేదని చెప్పారు. ఇప్పుడున్న ఎంపీలంతా దేశానికి స్వాతంత్ర్యం అక్కర్లేదంటే తీసుకెళ్లి తిరిగి బ్రిటీష్‌ దేశంలో కలిపేస్తారా అని ఘాటుగా ప్రశ్నించారు.

వెంకయ్యనాయుడు వాఖ్యలకు కౌంటర్‌గా సుజనా తన అభిప్రాయం చెప్పిఉంటే ఆశ్చర్యపోవాల్సింది లేదు. కానీ ఎంపీలు ఒప్పుకోకుంటే దేశాన్ని తీసుకెళ్లి బ్రిటిష్ వాళ్లకు అప్పగిస్తారా అన్న స్థాయిలో ప్రశ్నించడమే ఆసక్తికరంగా ఉంది. ఈ వ్యాఖ్యల బట్టి అయితే ఇద్దరి మధ్య బాగానే చెడినట్టుగా ఉంది. అయితే నాయుడు, చౌదరి మధ్య నిజంగానే చెడిందా లేక.. ఎవరి పార్టీ మైలేజ్‌ కోసం వారు ఇలా పైకి ఘాటుగా మాట్లాడుతున్నారా అన్న అనుమానం కూడా వ్యక్తమవుతోంది. ఎందుకంటే బీజేపీ, టీడీపీ మధ్య సంబంధాల సంగతి పక్కనపెడితే… చంద్రబాబు, వెంకయ్య మధ్య ఉన్న వ్యక్తిగత బంధం మాత్రం చాలా బలమైనది. అందుకే వెంకయ్య, సుజనా మధ్య మాటల యుద్ధంపై రెండు పార్టీల నేతలకు నమ్మకం కుదరడం లేదు. పైగా ఇద్దరూ మోదీ ప్రభుత్వంలో మంత్రులు మరి. దీని వెనుక చంద్రబాబు రాజకీయ చతురత కూడా ఉందా అన్న అనుమానం వ్యక్తమవుతోంది.

Tags:    
Advertisement

Similar News