ఉన్నతాధికారిని బూతులు తిట్టిన మంత్రి
ఏపీ సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖమంత్రి రావెల కిషోర్ బాబు అధికారులపై ఓ రేంజ్‌లో మండిపడ్డారు. అందరి ముందే ఉన్నతాధికారిని బూతులు తిట్టారు. గుంటూరులో గిరిజన సంక్షేమ శాఖ అధికారులతో సమీక్ష సందర్బంగా ఈ ఘటన జరిగింది. గిరిజనసంక్షేమ శాఖలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయన్న మంత్రి… తమ ఆదేశాలను ఎవరూ పాటించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరేమైనా లార్డ్స్.. కింగ్స్ అనుకుంటున్నారా అంటూ అధికారులపై రుసరుసలాడారు. విశాఖ జిల్లా పాడేరు డివిజన్ గిరిజన శాఖ డిప్యూటీ […]
ఏపీ సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖమంత్రి రావెల కిషోర్ బాబు అధికారులపై ఓ రేంజ్‌లో మండిపడ్డారు. అందరి ముందే ఉన్నతాధికారిని బూతులు తిట్టారు. గుంటూరులో గిరిజన సంక్షేమ శాఖ అధికారులతో సమీక్ష సందర్బంగా ఈ ఘటన జరిగింది. గిరిజనసంక్షేమ శాఖలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయన్న మంత్రి… తమ ఆదేశాలను ఎవరూ పాటించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరేమైనా లార్డ్స్.. కింగ్స్ అనుకుంటున్నారా అంటూ అధికారులపై రుసరుసలాడారు. విశాఖ జిల్లా పాడేరు డివిజన్ గిరిజన శాఖ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ టి.మోహన్‌రావుపై నేరుగా మండిపడ్డారు. ఉన్నతాధికారులు ఇచ్చే సూచనలు పాటించడం లేదంటూ ”బ్లడీఫెలోస్” అంటూ విరుచుకుపడ్డారు. సమావేశంలో మంత్రి ఇలాంటి పదాలు వాడడంతో మిగిలిన అధికారులు కూడా షాక్ అయ్యారు.