జగన్ ఏం చేసినా వాళ్లకు కష్టమే
ఏపీలో రాజకీయాలు మరీ దిగజారిపోతున్నాయి. టీడీపీ, వైసీపీ నేతలు దిగజారి విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా వరద పరిస్థితులపై టీడీపీ నేతలు చేస్తున్న విమర్శలు ఆపార్టీ వైఖరిని మరోసారి స్పష్టం చేస్తున్నాయి. రాష్ట్రంలో ఎక్కడైనా పెద్ద ప్రమాదం జరిగినా, అంటు వ్యాధులు వచ్చి జనాలు చనిపోతున్నా.. మరేదైనా జరగరాని సంఘటన జరిగినా ప్రభుత్వాధినేతల కంటే ముందే ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ వెళ్లి పరామర్శించే వారు. దాన్ని అధికార టీడీపీ నాయకులు శవ రాజకీయాలు అని విమర్శించేవారు. జగన్ […]
Advertisement
ఏపీలో రాజకీయాలు మరీ దిగజారిపోతున్నాయి. టీడీపీ, వైసీపీ నేతలు దిగజారి విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా వరద పరిస్థితులపై టీడీపీ నేతలు చేస్తున్న విమర్శలు ఆపార్టీ వైఖరిని మరోసారి స్పష్టం చేస్తున్నాయి. రాష్ట్రంలో ఎక్కడైనా పెద్ద ప్రమాదం జరిగినా, అంటు వ్యాధులు వచ్చి జనాలు చనిపోతున్నా.. మరేదైనా జరగరాని సంఘటన జరిగినా ప్రభుత్వాధినేతల కంటే ముందే ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ వెళ్లి పరామర్శించే వారు. దాన్ని అధికార టీడీపీ నాయకులు శవ రాజకీయాలు అని విమర్శించేవారు. జగన్ పై లేనిపోని విమర్శలు చేసేవారు.
బాధితులకు అండగా నిలవడం, గ్రామాల్లో అపరిశుభ్ర వాతావరణాన్ని ప్రతిపక్ష నేత హోదాలో ప్రశ్నిస్తే అదీ శవరాజకీయం అన్నారు. చివరకు సకాలంలో వర్షాలు లేక, పంట చేతికి రాక, అప్పులు కట్టలేక రైతులు ఆత్మహత్య చేసుకుంటే వారిని పరామర్శించేందుకు వెళ్లినా అదీ శవరాజకీయమేనని తెలుగు తమ్ముళ్లు దుమ్మెత్తి పోశారు. జగన్ ఎక్కడికి వెళ్లినా విమర్శించే తెలుగుదేశం పార్టీ నేతలు ఇప్పుడు కొత్త పల్లవి అందుకున్నారు.
నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో తీవ్రమైన వరదలతో జనం అష్టకష్టాలు పడుతుంటే జగన్ మాత్రం పట్టించుకోవడం లేదని, పరామర్శించడం లేదని టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ విమర్శించారు. ప్రజలు వరదల్లో చిక్కుకుని అల్లాడుతుంటే.. జగన్ కు వరంగల్ ఉప ఎన్నికే ప్రధానంగా మారిందని ధ్వజమెత్తారు. ఇంతకాలం అధికార పార్టీకంటే జగన్ ముందే పరామర్శిస్తే తప్పుపట్టారు. ఇప్పుడు వరంగల్ ఉప ఎన్నికల ప్రచారంలో జగన్ ఉన్న విషయాన్ని ఆసరాగా తీసుకుని కొత్త విమర్శలకు తెరతీశారు. వరద ప్రాంతాల్లో జగన్ పర్యటించకపోవడం తప్పు అన్నట్టు మాట్లాడారు.
టీడీపీ నేతలకు వెంటనే వైసీపీ నేతలు కూడా కౌంటర్ ఇచ్చారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో జగన్ పర్యటన ఖరారైన తరువాతకూడా విమర్శలుచేయడం హేయమని వైసీపీ సీనియర్ నేతలు అంటున్నారు. విశాఖలో తుఫాను వచ్చినపుడు వెంటనే బాబు అక్కడికి వెళ్లి తిష్టవేయడంవల్ల మేము చేయాల్సినపనులు ఏమీ చెయ్యలేకపోతున్నామని, ముఖ్యమంత్రి వెంటవుండడంతోనే మా కాలమంతా సరిపోతుందని విశాఖ కలెక్టర్ చేసిన విమర్శలను ఈ సందర్భంగా వైసీపీ నేతలు గుర్తుచేస్తున్నారు. వర్షాలు వస్తున్నప్పుడే జగన్ వెళ్లి అక్కడ పర్యటించివుంటే టీడీపీ నేతలు విమర్శించేవారు కాదా అని ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు అయితే ప్రత్యేక విమానాల్లో పర్యటించగలరు కాని, జాతీయ రహదారి తెగిపోయి ఒక ప్రాంతానికి మరో ప్రాంతానికి రోడ్డు సౌకర్యమే లేనప్పుడు జగన్ ఎలా పర్యటిస్తాడని ప్రశ్నిస్తున్నారు.
Advertisement